cloudfront

Advertisement


Home > Politics - Political News

ఇంట్లో ఈగల మోత.. ఢిల్లీలో పల్లకి మోత!

ఇంట్లో ఈగల మోత.. ఢిల్లీలో పల్లకి మోత!

రాష్ట్ర ప్రయోజనం కోసం తను పోరాడుతున్నట్టుగా.. రాష్ట్ర ఖజానా నుంచి తీసుకున్న సొమ్ముతో.. ప్రత్యేక విమానాలు వేసుకుని వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి ఇంట్లో ఈగలమోత, బయట పల్లకి మోత అన్నట్టుగా తయారైంది. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన ఈ దీక్షకు ఇతర పార్టీల నేతలు బాగానే వచ్చారు. ఎలాగూ ఇప్పుడు బీజేపీ వ్యతిరేక కూటమికి అంతా తానే అని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు కాబట్టి.. రాహుల్ వచ్చారు, శరద్ పవార్ వచ్చారు, అబ్దుల్లా వచ్చారు.

అయితే చంద్రబాబు వెంట తమ కుల సంఘాలోళ్లు తప్ప.. ఏపీ నుంచినే ఇతర పార్టీల వాళ్లు వెళ్లలేదు. తమ కులానికి చెందిన మేధావి తదితరులను మాత్రం బాబు వెంటపెట్టుకెళ్లారు. వీళ్లందరికీ విమానాల టికెట్లు, వీఐపీ ట్రీట్ మెంటు ప్రీ.. ఎంత కాదనుకున్నా కులబాంధవులు కాబట్టి వెళ్లారు.

చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ఒక పేరంటంలా చేయాలని సంకల్పించారు. అందుకే అన్ని పార్టీల వాళ్లనూ పిలిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, కమ్యూనిస్టులను, జనసేనను పిలిచారు. ఎలాగూ వైసీపీ వెళ్లదు. ప్రత్యేకహోదా గురించి మీరు మాట్లాడేదేంది చంద్రబాబు.. అని ఆ పార్టీ రియాక్షన్ ఇచ్చింది. ఇక జనసేన కూడా బాబుకు దూరంగా జరుగుతోంది.

కమ్యూనిస్టులు కుండబద్ధలు కొట్టారు. అంతేకాదు తమ జాతీయ పార్టీ నాయకత్వాన్ని కూడా బాబు దీక్షా శిబిరం ఛాయలకు వెళ్లొద్దని వీరు చెప్పారు. ఇదీ పరిస్థితి. రాష్ట్రస్థాయి పార్టీలు.. ‘నిన్ను నమ్మం బాబు’ అంటున్నాయి. ప్రత్యేకహోదా విషయంలో బాబుగారు ఇప్పటికే చాలా సినిమాలు చూపించిన దాఖలాలున్నాయి.

ఇప్పుడు ప్రత్యేకహోదా కావాలని అంటున్న బాబు.. రేపు మళ్లీ మాట మార్చడని నమ్మకం ఎవరికి లేదు. అయితే అనుకూల మీడియా వర్గాలు మాత్రం పగలంగా బాబుగారి దీక్షా శిబిరాన్నే చూపించాయి. జనాలు మాత్రం.. ఇప్పటి వరకూ బాబుగారు ప్రత్యేకహోదా అంశం గురించి ఎన్నిమాటలు మార్చారో.. చర్చించుకుంటూ కనిపించారు.