cloudfront

Advertisement


Home > Politics - Political News

వైఎస్సార్సీపీలో హిందూపురం పంచాయితీ తేలిందా?

వైఎస్సార్సీపీలో హిందూపురం పంచాయితీ తేలిందా?

హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పంచాయితీ తేలినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ నుంచి బాలయ్యను ఢీకొట్టే అభ్యర్థిని వైఎస్సార్సీపీ తేల్చినట్టుగా సమాచారం. ఆ అభ్యర్థి మాజీ పోలిస్ అధికారి ఇక్బాల్ అని తెలుస్తోంది. హిందూపురంలో వైసీపీ అభ్యర్థిత్వం గత కొన్నాళ్లుగా మలుపులు తిరిగింది.

గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసిన నవీన్ నిశ్చల్ ను కాదనుకుని ఇటీవల వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీని తీసుకొచ్చింది. మాజీ ఎమ్మెల్యేగా ఘనీకి నియోజకవర్గంలో మంచి గుర్తింపే ఉంది. అయితే.. నవీన్ నిశ్చల్ సహకరించకపోవడంతో ఘనీ అడ్డం తిరిగారు.

తనకు ఆరోగ్యం బాగోలేదని.. తను పోటీచేయడం లేదని ఆయన తెలిపినట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో వైసీపీ అభ్యర్థిత్వం మళ్లీ నవీన్ నిశ్చల్ కే అనే ప్రచారం కూడా జరిగింది. కానీ.. చివరకు అది మైనారిటీ కోటా కింద ఇక్బాల్ కు ఖరారు అయ్యింది.

హిందూపురంలో మైనారిటీ ఓటు బ్యాంకు గణనీయంగా ఉంది. ఇక నవీన్ నిశ్చల్ కు హిందూపురం పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు అనే పదవిని ఇచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. రేపటి నుంచి ఇక్బాల్, నవీన్ నిశ్చల్ ఇద్దరూ కలిసి ప్రచారం చేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

ఆ మేరకు నవీన్ నిశ్చల్ భవితవ్యం గురించి జగన్ హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. మరి వీరు రాజీ అవుతారా? టీడీపీ కంచుకోటలో బాలయ్యకు వైఎస్సార్సీపీ ఏ మేరకు పోటీ ఇస్తుంది? అనేది ప్రశ్నార్థకమే!

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

అనంత వైసీపీలో అప్పుడే మంత్రి పదవుల లొల్లి!