cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

మేధావులను ఉసిగొల్పుతున్న అయ్యన్న?

మేధావులను ఉసిగొల్పుతున్న అయ్యన్న?

అదేంటో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆసాంతం అసహనం అంటుకుపోయిందనుకోవాలి. లేకపోతే ఏపీలో ప్రభుత్వం మీద పోరాటం చేయాలన్నా, విమర్శలు చేయాలన్నా కూడా తెలుగుదేశం ఇతర ప్రతిపక్షాలు ఉన్నవి చాలవా. కానీ జనాలు ప్రభుత్వం మీద తిరగబడాలన్నది టీడీపీ పెద్దల ఫిలాసఫీలా ఉంది.

ఆ మధ్య చంద్రబాబు కూడా విశాఖ వాసులను పిరికివారు అంటూ నిందించారు. ఇపుడు ఆయన గారి అనుంగు అనుచరుడు, సీనియర్ నేత అయిన అయ్యన్నపాత్రుడైతే మేధావుల మీద గట్టిగానే మాట్లాడుతున్నారు. విశాఖ భూములను జగన్ తెగనమ్ముతూంటే చూస్తూ ఊరుకుంటారేంటి మేధావులూ అంటూ అయ్యన్న గొంతు పెంచుతున్నారు.

జగన్ ప్రభుత్వం అశీస్సులతోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం తెగనమ్ముతోందని అభాండాలూ వేశారు. రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ తో సంబంధం లేదని సాక్ష్తాత్తూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినా కూడా అయ్యన్న అదే మాట్లాడుతున్నారు.

ఇక విశాఖలో భూములన్నీ జగన్ వరసపెట్టి అమ్మేస్తున్నారంటూ పెద్ద లిస్టే ఇచ్చారు. అందులో నిజమెంతో ఉందో తెలియదు కానీ మేధావులు అంతా జగన్ సర్కార్ మీద పోరాటం చేయాలని అయ్యన్న గట్టిగా ఆకాక్షిస్తున్నారు.

మొత్తానికి లూలూ గ్రూప్ కు టీడీపీ పెద్దలు నాడు ఉచితంగా భూములు ఇస్తే అది ఒప్పు, ఇపుడు దురాక్రమణకు గురి అవుతున్న ఆ భూములను అమ్మి ప్రజోపయోగమైన కార్యక్రమాలను వెచ్చించాలని తాము అనుకుంటే తప్పా అని వైసీపీ నేతలు అయ్యన్నకు  కౌంటర్లేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×