cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

కేవ‌లం 1.16 ల‌క్ష‌ల మందికే జ‌రిమానా?

కేవ‌లం 1.16 ల‌క్ష‌ల మందికే జ‌రిమానా?

తెలంగాణ‌లో క‌రోనా క‌ట్ట‌డికి ఆ రాష్ట్ర హైకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. క‌రోనా క‌ట్ట‌డిలో ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్య‌క్తం చేసింది. తెలంగాణ‌లో క‌రోనా ప‌రిస్థితుల‌పై గురువారం హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. క‌రోనా మార్గ‌ద‌ర్శ కాల అమ‌లుపై హైకోర్టుకు డీజీపీ నివేదిక స‌మ‌ర్పించారు.

ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు చాలా త‌క్కువ‌గా చేస్తున్నార‌ని హైకోర్టు అసంతృప్తి వ్య‌క్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు 70 శాతం పెంచాలని సూచించింది. మద్యం దుకాణాలు, పబ్‌లు, థియేటర్లలో జ‌నం గుమికూడ‌డంపై హైకోర్టు ఆందోళ‌న‌, ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 

మద్యం దుకాణాలు కరోనా వనరులగా మారాయని హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్ర‌తి ఒక్క‌రికీ కరోనా పరీక్షలు చేయాలని సూచించింది.

కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సుమారు 22వేల కేసులు నమోదు చేసినట్టు డీజీపీ త‌న నివేదికలో పేర్కొన్నారు. అయితే చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 1.16 లక్షల మందికే  జరిమానానా?  అని హైకోర్టు ప్రశ్నించింది.

పాతబస్తీలో రెండ్రోజులు తనిఖీ చేస్తే లక్ష మంది దొరుకుతారని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. లాక్ డౌన్‌ లేకపోయినా.. కంటైన్‌మెంట్‌ జోన్లు కచ్చితంగా ఉండాలని హైకోర్టు సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో వ్యాక్సి నేషన్‌ ఏర్పాట్లు, క‌రోనా క‌ట్ట‌డికి తీసు కుంటున్న చ‌ర్య‌ల‌పై ఈనెల 14లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

లోకేష్ సవాల్ చూస్తే.. బ్రహ్మానందం గుర్తొస్తున్నాడు

దేవి సిక్స్ కొడితే...నేను రెండు సిక్సులు కొడ‌తా

 


×