cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

తమ్ముళ్ళ ఆనందం ఒక్కరోజేనా ?

తమ్ముళ్ళ ఆనందం ఒక్కరోజేనా ?

పరిషత్ ఎన్నికలకు బ్రేక్ అంటూ వచ్చిన వార్తలు ఉత్తరాంధ్రాలోని తమ్ముళ్లకు హుషార్ ఇచ్చాయి. న్యాయం ధర్మం అంటూ చాలానే పెద్ద మాట్లాడేశారు. ఇపుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే ఏకపక్షంగా వైసీపీకి విజయం దక్కుతుంది అన్న కలవరం వారికి చాలానే ఉంది.

దాంతో ఇపుడు ఎన్నికలు పెట్టడం కంటే ఆపడమే మేలు అని అనందించేశారు. సరిగ్గా ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే పరిషత్ ఎన్నికలకు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పసుపు శిబిరానికి షాక్ తగిలింది. ఇక వైసీపీ నేతలు అయితే నిరాశ నుంచి బయటపడి హడావుడి చేస్తున్నారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు పరిషత్ ఎన్నికలను బహిష్కరించడాన్ని మంత్రి అవంతి శ్రీనివాసరావు తప్పు పట్టారు. చంద్రబాబు టీడీపీని పతనావస్థకు చేరుస్తున్నాడని నిందించారు.

ఇదంతా ఆయన చేజేతులా చేసుకున్నదేనని కూడా విమర్శించారు. తనకూ కొడుకు లోకేష్ కి తప్ప ఎవరికీ పదవులు దక్కరాదు అన్నదే బాబు మార్క్ రాజకీయ విధానమని కూడా అవంతి సెటైర్లు వేశారు.

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×