cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ఇదేంద‌బ్బా జేసీ ...రోజుకో మాటేంది?

ఇదేంద‌బ్బా జేసీ ...రోజుకో మాటేంది?

తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి త‌న ఊరు నుంచి క‌ళ్యాణ‌దుర్గం వెళ్లే సరికి మాట కూడా మారింది. ఈ నెల 17న అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆ రోజు సాయంత్రం తాడిప‌త్రిలో త‌న ఇంట్లో జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలీసుల‌కు హ్యాట్సాప్ చెప్పారు. ఆ రోజు జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే తెలుసుకుందాం.

"ఈ రోజు నా నియోజ‌క‌వ‌ర్గంలో స‌ర్పంచ్ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.  ద‌గ్గ‌ర‌ద‌గ్గ‌ర 20 నెల‌లుగా ప్ర‌తి ఒక్క‌రూ పోలీసుల్ని ఏదో ఒక మాట అంటున్నారు. కానీ నేను ఒప్పుకోను. బ్ర‌హ్మాండంగా చేశారు. పోలీస్ అనిపించారు. త‌ల‌వంచి న‌మ‌స్కారం చేస్తున్నా. ఎవ‌రినీ లెక్క‌చేయ‌లేదు. 

టీడీపీ, వైసీపీ, స్వ‌తంత్ర అభ్య‌ర్థి అనేది లేదు. ఇంత బాగా ఎప్పుడూ ప‌ని చేయ‌లేదు. నిజంగా నేను హృద‌య పూర్వ‌కంగా చెబుతున్నా. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తి ఉద్యోగి బాగా ప‌నిచేశారు. ఇలాగే ప‌ని చేయండి. ప్ర‌జ‌ల‌కు అండ మీరే. ప్రెస్‌కు కూడా ఒక‌టి చెబుతున్నా...నిజాల్ని చెప్పాలి" అని అన్నారు.

ఈ రోజు జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. అక్క‌డ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏమ‌న్నారో ఆయ‌న మాటల్లోనే...

 "రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి ప్రజలకు వారధి కాకుండా ఎన్నికల్లో ఓట్లు వేయించేందుకు పూర్తి స్థాయిలో పని చేస్తోంది. ఆ వ్యవస్థను వెంటనే తీసేయాలి. కుప్పంలో కూడా ఎవరినీ నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ పూర్తిగా భయబ్రాంతులకు గురి చేసి ఏకపక్షంగా గెలిచామని గొప్పలు చెప్పుకుంటోంది" అని విమ‌ర్శించారు.

ఐదు రోజుల్లోనే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి మాట‌ల్లో ఎంత తేడానో గ‌మ‌నించొచ్చు. ప్ర‌జ‌ల‌కు మ‌తి మ‌రుపు అని జేసీ బ్ర‌ద‌ర్ భావిస్తున్నారా? ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తి ఉద్యోగి బాగా ప‌నిచేశారని కితాబిచ్చిన నోటితోనే విమ‌ర్శించ‌డానికి మ‌న‌సు ఎలా వ‌చ్చిందని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. 

బ‌హుశా ఐదు రోజుల క్రితం  నిజాలు మాట్లాడిన జేసీ బ్ర‌ద‌ర్‌పై టీడీపీ అధిష్టానం నుంచి అక్షింత‌లు ప‌డ‌డం వ‌ల్లే అభిప్రాయాలు మార్చుకున్నారేమో అనే కామెంట్స్ సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నాయి. 

విశాఖలో వైసీపీ ఓడిపోతే

కుప్ప‌మా ?.. కుప్పిగంతులా ? 

 


×