cloudfront

Advertisement


Home > Politics - Political News

‘ఏపీలో ఒక కులానికి అనుకూల పాలనే సాగుతోంది!'

‘ఏపీలో ఒక కులానికి అనుకూల పాలనే సాగుతోంది!'

ఆంధ్రప్రదేశ్ లో ఒక కుల ప్రయోజనాలకు అనుగుణంగానే పాలన సాగుతోంది అనడంలో ఎలాంటి సందేహంలేదు.. అని పేర్కొన్నారు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు. నవ్యాంధ్రలో నా నడక అనే పుస్తకంలోని ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్ర విభజన తర్వాత సీఎస్ గా తన అనుభవాలను పంచుకుంటున్న ఐవైఆర్.. చంద్రబాబు పాలనలో చోటు చేసుకున్న వివిధ అంశాలను ఆ పుస్తకంలో ప్రస్తావించారు. అందులో బాబు పాలన ఆయన సామాజికవర్గ ప్రయోజనాల కోసమే సాగుతోందని పేర్కొనడం ఆసక్తిదయాకం.

బ్రహ్మణ కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఎవరున్నా తెలుగుదేశం పార్టీ జెండా మోసే వ్యక్తే ఉండాలని చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారని ఐవైఆర్ పేర్కొన్నారు. పార్టీకి పనికి వచ్చేవాళ్లే ఆ కార్పొరేషన్ చైర్మన్ ఉండాలని బాబు స్పష్టం చేశారన్నారు.

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపును ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం తీసుకుందని ఐవైఆర్ పేర్కొన్నారు. ఆ సినిమాలో చరిత్రను వక్రీకరించారు, వాస్తవ విరుద్ధంగా తీశారని తెలిసినా.. ప్రభుత్వం పన్ను మినహాయింపును ఇచ్చిందని పేర్కొన్నారు.

ఈ విషయంలో తను కొంతమంది వద్ద అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. తను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం అనే ప్రచారాన్ని మొదలుపెట్టారని ఐవైఆర్ ఆ పుస్తకంలో పేర్కొనడం విశేషం. ఇంకా బోలెడన్ని ఉదాహరణలను పేర్కొంటూ ఏపీలో సాగుతున్న పాలనను విశ్లేషించారు ఐవైఆర్.

తన దగ్గర పనిచేసిన ఐఏఎస్ ల విషయంలో చంద్రబాబు నాయుడు రకరకాల కథలు చెబుతూ ఉంటాడు. మరి ఇప్పుడు ఐవైఆర్ ను ఎందుకు ప్రస్తావించడం లేదో అర్థంకావడం లేదు. ఒకవైపు ఐవైఆర్, మరోవైపు అజేయ కల్లంలు బాబు పాలనలోని వివిధ అంశాలను ప్రస్తావిస్తూ.. తీవ్రంగా దుయ్యబడుతూ ఉన్నారు.

వారు లేవనెత్తిన అంశాల విషయంలో ఏపీ ప్రభుత్వం స్పందిచండం లేదు. మాటెత్తితే వాళ్ల కులాలను ఎత్తి విమర్శిస్తారు కానీ.. వారు లేవనెత్తిన అంశాల వారీగా మాత్రం స్పందించడం లేదు.

సుజనా ఏమార్చేది ఇలాగేనా చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్