Advertisement

Advertisement


Home > Politics - Political News

కేసీఆర్ నాటు.. జగన్ నీటు

కేసీఆర్ నాటు.. జగన్ నీటు

ఇక్కడ జగన్, అక్కడ కేసీఆర్.. ఇద్దరి ఆలోచనలు ఒకటే అయినా.. ఆచరణలో మాత్రం చాలా తేడా ఉంది. కేసీఆర్ ముక్కుసూటిగా పనులు చేసుకుంటూ వెళ్తూ ఆల్రడీ చాలా దెబ్బలు తిన్నారు, ఇంకా తింటున్నారు కూడా. వీఆర్వోలను ఏకబిగిన పీకిపారేసి తన ప్రతాపం చూపించారు. 

ఎన్నికల్లో.. ఆయా కుటుంబాల తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ధరణి పోర్టల్ పేరుతో భూ యజమానుల వివరాలు తీసుకుంటూ కోర్టు కేసుల్ని ఎదుర్కొంటున్నారు. అసలు ధరణి అట్టర్ ఫ్లాప్ షో అని అక్కడి అధికారులే చెప్పడం గమనార్హం.

ఇక జగన్ విషయానికొస్తే.. ఏపీలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వీఆర్వోల అధికారాలకు కత్తెర వేశారు జగన్. పోస్టులు తీసేయకుండానే.. ఆ అధికారంలో ఉన్నవారి అవినీతి మకిలిని తొలిగిస్తున్నారు. భూముల రీ-సర్వే పేరుతో జగన్ చేపట్టిన బృహత్తర కార్యక్రమం ధరణికి ప్రతిరూపమే. అయితే ఇక్కడ పనులు సవ్యంగా జరుగుతుండటం గమనించ దగ్గ విషయం.

బ్రిటిష్ కాలంలో వందల ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా భూ సర్వే జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు జగన్ జమానాలో ఏపీలో రీ సర్వే జరుగుతోంది. రాష్ట్రంలో ఆల్రెడీ జరిగిన, జరుగుతున్న, జరగబోయే భూ తగాదాలన్నిటికీ ఈ రీ సర్వే చెక్ పెట్టబోతుందని అధికారులంటున్నారు.

ఈనెల 21న కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష పేరుతో ఈ పథకం మొదలు కాబోతోంది. 2023 వరకు మూడు దశల్లో దీన్ని పూర్తి చేస్తారు. రాష్ట్రం మొత్తం సుశిక్షితులైన 14వేల మంది సర్వేయర్లు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములవుతారు.

956 కోట్ల రూపాయల ఖర్చుతో జరగబోతున్న రీ సర్వే కార్యక్రమంలో డ్రోన్లను వినియోగిస్తారు. అత్యాథునిక సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరిహద్దులు నిర్ణయిస్తారు. ప్రభుత్వ ఖర్చుతోనే సర్వే రాళ్లు కూడా వేస్తారు. అటవీ భూములు మినహాయించి, వ్యవసాయ, గ్రామ కంఠం, పట్టణాల్లోని అన్ని రకాల భూముల్ని ఈ సర్వేలో కొలతలేస్తారు.

రీసర్వే తర్వాత భూ వివాదాలపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. మొబైల్ కోర్టుల ద్వారా తగాదాలను పరిష్కరిస్తారు. ఈ సర్వే కోసం.. కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం... దేశంలోనే ఇలా రీ సర్వే చేస్తున్న తొలి రాష్ట్రంగా  రికార్డుల్లో కెక్కుతోంది.

అయితే ఎక్కడా ఎవరికీ ఎలాంటి ఇబ్బందు లేకుండా రీ సర్వే పూర్తి చేయాలని జగన్ నిర్ణయించారు. అదే తెలంగాణలో భూ యజమానుల వివరాలు నమోదు చేసుకునే సమయంలో లెక్కలేనన్ని సమస్యలు తలెత్తాయి. భూమి వివరాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. 

ఏపీలో మాత్రం ఎవరినీ ఎవరూ వివరాలు అడగరు, ప్రభుత్వ లెక్కల ప్రకారం సర్వే చేసి సరిహద్దులు నిర్ణయిస్తారు, సమస్యలొస్తే సత్వరమే పరిష్కరిస్తారు.

మొత్తమ్మీద అధికారం చేపట్టిన ఏడాదిన్నరలోనే రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా ఇలాంటి కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనుండడం చెప్పుకోదగ్గ విశేషం. ఈ విషయంలో కేసీఆర్ నాటుగా వ్యవహరిస్తే, జగన్ చాలా నీటుగా పని పూర్తిచేస్తున్నారు. 

మ‌హేష్ తో ఒక్క‌డు కంటే గొప్ప సినిమా తీయాలి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?