Advertisement

Advertisement


Home > Politics - Political News

'కాపు'కాసేది ఎప్పటికీ ముఖ్యమంత్రి జగన్ గారు మాత్రమే

'కాపు'కాసేది ఎప్పటికీ ముఖ్యమంత్రి జగన్ గారు మాత్రమే

కాపు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఏపీ 2022-23 వార్షిక బడ్జెట్ లో రూ. 4000 కోట్లు కేటాయించడం పట్ల కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. 

ఏపీ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌ అడపా శేషగిరి, రాజానగరం శాసనసభ్యుడు జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, నార్త్‌ అమెరికాలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ అసెంబ్లీలో ముఖ్యమంత్రిని కలిసి సన్మానించారు.

ఈ సందర్భంగా నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ మాట్లాడుతూ.. కాపుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లో అన్ని కులాల కంటే ఎక్కువగా నిధులు కేటాయించారని హర్షం వ్యక్తం చేశారు. కాపులకు మంచి చేసే విషయంలో సీఎం జగన్ నాలుగడుగులు ఎప్పుడూ ముందుంటారని మరోసారి నిరూపించారన్నారు. 

కాపు నేస్తం ద్వారా దాదాపు 3.27 లక్షల మందికి ఇప్పటి వరకు 2 దఫాల్లో రూ. 980 కోట్ల మేర లబ్ధిచేకూరిందని రత్నాకర్ పేర్కొన్నారు. టీడీపీ హయాంలో వివిధ సంక్షేమ పథకాల రూపంలో కాపులకు సగటున ఏడాదికి రూ. 400 కోట్లు మాత్రమే అందాయని, సీఎం జగన్ పాలనలో కేవలం రెండేళ్లలోనే రూ. 13 వేల కోట్లు వివిధ పథకాల రూపంలో అందాయన్నారు.

సంక్షేమంలోనే కాకుండా రాజకీయంగానూ కాపులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ పెద్దపీట వేశారని రత్నాకర్ అన్నారు. కాపులకు 5 మంత్రి పదవులు కేటాయించడంతో పాటు వ్యవసాయ శాఖ, ఆరోగ్య శాఖ, పట్టణాభివృద్ధి శాఖ, సమాచారం, రవాణా, టూరిజం వంటి కీలక శాఖల బాధ్యతలను అప్పజెప్పి కాపులకు ఉన్నతాసనం వేశారని తెలిపారు. 

కాపులను నమ్మించి గొంతు కోసిన చరిత్ర బాబుది అయితే.. కాపులకు కాసేది ఎప్పటికీ సీఎం జగన్ మాత్రమేనని రత్నాకర్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?