cloudfront

Advertisement


Home > Politics - Political News

జగన్ ఈ రాష్ట్రానికి డ్రైవర్ గా మారాలి

జగన్ ఈ రాష్ట్రానికి డ్రైవర్ గా మారాలి

తెల్ల చొక్కాతో నిరంతరం పాదయాత్రలో నిమగ్నమై కనిపించే వైఎస్ఆర్సీ అధినేత జగన్ ఒక్కసారిగా ఖాకీలోకి మారారు. ఖాకీ చొక్కా వేసుకొని ఆటో డ్రైవర్ అవతారం ఎత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని మేదినరావుపాలెం జంక్షన్ వద్ద, ఆటోడ్రైవర్ యూనిఫాం వేసుకొని, ఆటోలో డ్రైవర్ సీట్ లో కూర్చున్నారు జగన్.

చంద్రబాబులా ఇది ప్రచారం కోసం స్టంట్ కాదు. ఫొటోలకు పోజులివ్వడానికి అంతకంటే కాదు. జగన్ ఇలా ఆటోడ్రైవర్ యూనిఫాం వేయడం వెనక ఓ రీజన్ ఉంది. మొన్న ఏలూరులో జరిగిన బహిరంగ సభలో ఆటోడ్రైవర్లకు వరాలు ప్రకటించారు జగన్. వైఎస్ఆర్సీ అధికారంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఆటో డ్రైవర్ కు 10వేల రూపాయలు అందజేస్తామని ప్రకటించారు. దానికి కృతజ్ఞతగా ఇలా ఆటోడ్రైవర్లంతా కలిసి జగన్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు. 

సొంత ఆటో ఉన్న ప్రతి ఒక్కరికి 10వేల రూపాయలు అందిస్తామని ప్రకటించారు జగన్. వెహికల్ టాక్స్, లైఫ్ టాక్స్ వంటి పన్నుల భారాన్ని ఆ విధంగా తగ్గిస్తామని.. ఆటోల్లో ప్రయాణించే పౌరుల భద్రతకు భరోసా కల్పించేలా.. డ్రైవర్ తో పాటు అందులో ప్రయాణించే ప్రయాణికులకు కూడా బీమా సౌకర్యాన్ని అందిస్తామని జగన్ ప్రకటించారు. ఇప్పటివరకు ఎవరూ చేయని వినూత్న ఆలోచన ఇది. అందుకే ఆటోడ్రైవర్లంతా జగన్ పై ఇలా తమ ప్రేమను కురిపించారు. 

కొద్దిసేపు ఆటోకి డ్రైవర్ గా మారిన జగన్.. ఆంధ్రప్రదేశ్ కు డ్రైవర్ గా మారాలని ఆటోడ్రైవర్లు ఆకాంక్షించారు. అప్పుడే రాష్ట్రం గాడిన పడుతుందని, అభివృద్ధి జరుగుతుందని అన్నారు. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాలో జగన్ పాదయాత్రకు యువత నుంచి విశేష స్పందన వస్తోంది. యూత్ అంతా జగన్ తో సెల్ఫీలు దిగేందుకు, ఆటోగ్రాఫ్ లు తీసుకునేందుకు ఎగబడుతున్నారు.