Advertisement

Advertisement


Home > Politics - Political News

చంద్రబాబు అష్టదిగ్బంధం

చంద్రబాబు అష్టదిగ్బంధం

అధికారం చేపట్టి ఏడాది కాలంలోనే చంద్రబాబుని పూర్తిగా కార్నర్ చేశారు సీఎం జగన్. ఏడాదిన్నర లోనే ఆయన్ను అష్టదిగ్బంధనం చేసేశారు. అమరావతిపై చంద్రబాబు ఆశలు గల్లంతు చేసి ఆయన ఆర్థిక మూలాలను పడగొట్టారు. బాబు ఊ అంటే.. జగన్ పై విరుచుకుపడే అచ్చెన్న కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులపాలవుతున్నారు. తాను కనుసైగ చేస్తే టీడీపీలో నుంచి వైసీపీలోకి జంప్ చేయడానికి ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నా.. వారిని అక్కడే ఉంచి తమాషా చూస్తున్నారు జగన్. 

ఉంటారో పోతారో తెలియని ఎమ్మెల్యేలను వెనక పెట్టుకుని చంద్రబాబు పడే మానసిక ఆందోళన వర్ణనాతీతం. కొడుకు ఎమ్మెల్సీ ఉద్యోగానికి కూడా ఎసరు వచ్చే ప్రమాదం మరింత బాధాకరం. జగన్ ప్రమేయం లేకపోయినా.. రాష్ట్రంలో బాబుకి వంతపాడే బీజేపీ అధ్యక్షుడు పోయి, మాటి మాటికీ గిల్లే కొత్త అధ్యక్షుడు రావడం ఆయన బ్యాడ్ టైమ్ ఎలా ఉందో చెప్పడానికి మరో ఉదాహరణ.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి పదవి దక్కిందనే ఆనందాన్ని కూడా మున్సిపాల్టీ ప్రత్యేక అధికారుల పాలన పొడిగించడం ద్వారా ఆవిరైంది. ఇప్పుడిక చేష్టలుడిగి చూడటం మినహా చంద్రబాబు చేయడానికేం లేదు. ఒకరకంగా చంద్రబాబు భయపడినదాని కంటే చాలా ముందుగానే జగన్ ఆయన్ను కార్నర్ చేయగలిగారు. జగన్ పనిగట్టుకుని చేయకపోయినా.. బాబు చేసిన తప్పులే ఆయన్ను వెంటాడుతున్నాయి. ఈ అష్టదిగ్బంధంలో అన్నిటికంటే పెద్దది చంద్రబాబు ఆర్థిక మూలాలపై పడ్డ వేటు.

మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతిపై చంద్రబాబు పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతయ్యాయి. తనతోపాటు, తన మంత్రివర్గ సహచరులు, ఇతర నేతలు, మీడియా సంస్థల అధినేతలు.. అందరితో అమరావతిలో పెట్టుబడులు పెట్టించారు బాబు. బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేయించి, ల్యాండ్ పూలింగ్ లో ప్రభుత్వానికి అందించి రెండు విధాలా లాభాలు పొందారు. సీఆర్డీఏ రద్దుతో బాబు గుండె గుభేల్ మంది. చంద్రబాబుని నమ్మి అమరావతిపై ఆశలు పెట్టుకున్నవారంతా ఇప్పుడాయన్ని నిలదీస్తున్నారు. మా సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ఇకపై పార్టీకి అందే ఆర్థిక సాయంపై ఆశలు పెట్టుకోవద్దని తేల్చి చెప్పేస్తున్నారు.

ఈ దశలో చంద్రబాబుకి ఏం చేయాలో పాలుపోక జూమ్ ద్వారా రంకెలేస్తున్నారు. న్యాయస్థానాల ద్వారా అడ్డుపుల్లలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుకి జగన్ పెట్టిన ఫైనల్ చెక్ ఇదే. దీంతో బాబు అష్టదిగ్బంధం పూర్తయినట్టే. 

రైతులు త్యాగం చేశారా.. డీల్ చేసుకున్నారా ?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?