cloudfront

Advertisement


Home > Politics - Political News

చంద్రబాబుపై ఒత్తిడి తగ్గించిన జగన్

చంద్రబాబుపై ఒత్తిడి తగ్గించిన జగన్

ఇటీవల కాలంలో చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా యువకులు, నిరుద్యోగుల నుంచి ఒకటే నిరసనలు. ముఖ్యంగా డీఎస్సీ ప్రకటనతో మోసపోయిన ఉద్యోగార్థులు.. మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలకు వెళ్లి ప్లకార్డులు పట్టుకుని ఆందోళనకు దిగుతున్నారు. ఊరించి ఊరించి ఉసూరుమనిపించిన నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు బాగానే ఒళ్లు మండింది. అవకాశం, అర్హత, టాలెంట్ అన్నీ ఉన్నా ఒకటీ అరా పోస్టులతో వచ్చిన నోటిఫికేషన్లు నిరుద్యోగులను తీవ్ర నిరాశలో నెట్టాయి.

ఎన్నికలకు ముందు బాబు-జాబు అంటూ ఊదరగొట్టి, అవసరం తీరాక అరకొర పోస్టులతో వెక్కిరించినట్టు నోటిఫికేషన్లు ఇవ్వడంతో యువత ఆందోళన బాటపట్టింది. అయితే ఇదే సమయంలో ప్రతిపక్ష నేత జగన్ చేసిన ప్రకటన చంద్రబాబుపై ఒత్తిడి తగ్గించింది. నిరసనల సెగ నుంచి బాబుకి ఊరటనిచ్చింది.

అధికారంలోకి వచ్చిన ఏడాదే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని, ఏపీపీఎస్సీ ద్వారా 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రతి ఊరిలో సచివాలయం నెలకొల్పి ఊరికి 10 మందికి ఉద్యోగాలిస్తామని, పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ జగన్ శ్రీకాకుళం పర్యటనలో యువతకు స్పష్టమైన హామీ ఇచ్చారు.

జగన్ ప్రకటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా యువతలో కొత్త ఆశలు చిగురించాయి. జాబు రావాలంటే బాబు పోవాలని నిరుద్యోగులంతా ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. ఆ మేరకు చంద్రబాబును ఇంటికి పంపించాలని రాష్ట్రవ్యాప్తంగా యువత నిర్ణయించుకుంది. దీంతో బాబుకి నిరసనల సెగ పూర్తిగా తప్పినట్టే.

ఒకరకంగా జగన్ ప్రకటన వల్ల చంద్రబాబు సేవ్ అయ్యారు, ఇప్పటికిప్పుడు చంద్రబాబుకి ఉపశమనం లభించినా, యువత అంతా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి బదులు తీర్చుకోడానికి సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగాల పేరుతో దారుణంగా మోసం చేసిన బాబుకి బుద్ధి చెప్పాలని కసిగా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. 

తెలంగాణ తీర్పు ప్రభావం.. ఏపీపై ఉంటుందా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్