cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

జ‌గ‌న్‌... హీరో అని కీర్తిస్తున్న‌ ఆంధ్ర‌జ్యోతి

జ‌గ‌న్‌... హీరో అని కీర్తిస్తున్న‌ ఆంధ్ర‌జ్యోతి

మొత్తానికి ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను ఆంధ్ర‌జ్యోతి ఒక్క‌సారిగా హీరో చేసింది. అమిత్‌షాను బాద్‌షా అని కీర్తించిన ఆంధ్ర‌జ్యోతి...అలాంటి నేత‌నే జ‌గ‌న్ ఢీ అంటే ఢీ అంటున్నాడ‌ని, ఢిల్లీ పెద్ద‌ల‌ను ఏ మాత్రం ఖాత‌రు చేయ‌డం లేద‌ని అదే క‌లంతో రాసుకొచ్చింది. మొట్ట మొద‌టిసారిగా జ‌గ‌న్ నిజ‌మైన క్యారెక్ట‌ర్‌ను ఆంధ్రాప్ర‌జానీకానికి తెలియ‌జెప్పే ఆస‌క్తిక‌ర క‌థ‌నం "ఢిల్లీని గిల్లి" శీర్షిక‌తో ఆంధ్ర‌జ్యోతి బ్యాన‌ర్ ఐట‌మ్‌గా ఎంతో ప్రాధాన్యం ఇస్తూ ప్ర‌చురించింది.

అక్రమాస్తుల కేసులు, సీబీఐ విచారణ కత్తి వేలాడుతున్నా సరే... ‘ఢిల్లీతో ఢీ’ అనేందుకే జగన్‌ నిర్ణయించుకున్నారా? అని ప్ర‌శ్నిస్తూ జ‌గ‌న్ ఏమా ధైర్యం అన్న‌ట్టు రాసుకొచ్చారు. దీనంత‌టికి కార‌ణం ఏపీ ఇంటెలిజెన్స్ అధిప‌తిగా మ‌నీశ్‌కుమార్ సిన్హాను నియ‌మించ‌డ‌మేన‌ట‌. ఎవ‌రి పేరు చెబితే దేశంలోని రాజ‌కీయ నాయ‌కులంతా గ‌డ‌గ‌డ‌లాడుతారో ...అలాంటి అమిత్‌షాను, అయితే ఏంట‌ట‌? అని మ‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పేర్కొన్నారు.

బీజేపీ, వైసీపీ మధ్య అనూహ్యమైన లడాయి, ఘర్షణకు తెలంగాణ కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి స్టీఫెన్‌ రవీంద్రను ఏపీకి డిప్యుటేషన్‌పై పంపేందుకు కేంద్రం అనుమతించకపోవడంతోనే బీజం పడిందిద‌ని ఆంధ్ర‌జ్యోతి ప్ర‌తినిధులు శోధించి మ‌రీ క‌నుక్కున్నారు.  స్టీఫెన్‌ రవీంద్ర కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మనీశ్‌ కుమార్‌ సిన్హాను ఇంటెలిజెన్స్‌ అధిపతిగా ఇటీవ‌ల జ‌గ‌న్ నియ‌మించారు.

అయితే కేంద్రంతో ‘ఢీ అంటే ఢీ’ అనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పేందుకే మనీశ్‌కు కీలక పదవి కట్టబెట్టినట్లు తెలుస్తోంద‌ని రాశారు. కేంద్ర పెద్దలకు ఆగ్రహం వ‌చ్చింద‌ని తెలిసి వివరణ ఇచ్చేందుకే జగన్‌ ఢిల్లీకి వెళ్లారని సమాచారం అందింద‌ట‌. అయితే, జగన్‌ ‘ధిక్కార’ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న అమిత్‌షా... ఢిల్లీకి రమ్మని మరీ ఆయనకు ముఖం చాటేసినట్లు ఆంధ్ర‌జ్యోతికి తెలిసింద‌ట‌.

ఇంత‌కూ ఈ మ‌నీశ్‌కుమార్ ఎవ‌రంటే...

బిహార్‌కు చెందిన మనీశ్‌ కుమార్‌ సిన్హా ఏపీ కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. 13 ఏళ్లు రాష్ట్రంలో పని చేశాడు. 2013లో కేంద్ర సర్వీసులకు వెళ్లాడు. సీబీఐ డీఐజీగా నియమితుడ‌య్యాడు. గత ఏడాది సీబీఐలో త‌లెత్తిన‌ ‘డైరెక్టర్‌ అలోక్‌ వర్మ వర్సెస్‌ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానా’ వివాదంలో మనీశ్‌ కూడా ఒక పాత్రధారి. అమిత్‌షా సొంత మ‌నిషిగా పేరొందిన రాకేశ్ ఆస్థానా, అలోక్‌వ‌ర్మ‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ బాధ్య‌త‌ల‌ను మ‌నీశ్‌కు అప్ప‌గించారు.

దర్యాప్తు చేస్తున్న మొత్తం బృందాన్ని రాత్రికి రాత్రి కేంద్రం దేశ న‌ల‌మూల‌కు బదిలీ చేసింది. ఆ బ‌దిలీ అయిన వారిలో మ‌నీశ్ ఉన్నాడు. ఇత‌ను  జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. అలాంటి వ్య‌క్తికి జ‌గ‌న్ కీల‌క ఇంటెలిజెన్స్ చీఫ్ ప‌ద‌వి ఇవ్వ‌డం అమిత్‌షాకు కోపం తెప్పించింద‌ని ఆంధ్ర‌జ్యోతిలో రాశారు. 

‘‘మీరు స్టీఫెన్‌ రవీంద్రను ఇవ్వనంత మాత్రాన ఊరుకుంటామా! మిమ్మల్ని ఢీకొట్టిన, మీ వాళ్ల గుట్టు తెలిసిన అధికారికే పట్టం కడతాం’’ అనేలా జగన్‌ వ్యవహరించారని... దీనిని కేంద్రం తీవ్రంగా పరిగణించిందని ఆంధ్ర‌జ్యోతికి తెలిసింద‌ట‌.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మంచిరోజులొచ్చిన‌ట్టే...

ఈ రాత‌లు నిజమైతే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మంచిరోజులు వ‌చ్చిన‌ట్టే. సీబీఐ, ఈడీ కేసుల కార‌ణంగా కేంద్రాన్ని జ‌గ‌న్ ప్ర‌శ్నించ‌లేడ‌ని ఆంధ్ర‌జ్యోతిలో రాయ‌ని రోజు లేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా అమిత్‌షాను ఢీకొట్టే ఒకేఒక్క మ‌గాడు దేశ మొత్తంలో మ‌న సీఎం జ‌గ‌న్ అని ఆంధ్ర‌జ్యోతి రాసిందంటే...అంత‌కంటే ఆనందం ఏముంది?  నిజానికి ఈ క‌థ‌నం ప‌చ్చి వండ‌కం అని తెలుస్తూనే ఉంది. మోడీ, అమిత్‌షాల‌తో ఢీ అంటే ఢీ అని గొడ‌వ‌కు దిగిన త‌న ఆత్మ చంద్ర‌బాబు ఘోర‌ప‌రాజ‌యం పాల‌య్యాడ‌ని ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ న‌మ్ముతున్నాడు.

ఇప్పుడు జ‌గ‌న్‌ను ఓడించాలంటే కేంద్రంతో జ‌గ‌న్ గొడ‌వ పెట్టుకుంటే త‌ప్ప సాధ్యం కాద‌ని అత‌ని ఆలోచ‌న‌. అందుకే ఏదో విధంగా కేంద్రంతో జ‌గ‌న్‌కు సంబంధాలు తెగ్గొట్టాల‌ని క‌ల్పిత క‌థ రాసిన‌ప్ప‌టికీ...జ‌గ‌న్‌ను హీరో చేయ‌డం ప‌త్రిక‌కు శుభ‌ప‌రిణామ‌మ‌ని చెప్పొచ్చు. ఈ ఒక్క క‌థ‌నం చాలు...ఆంధ్ర‌జ్యోతికి ఇక‌పై యాడ్స్ ఇచ్చేందుకు. 

 


×