Advertisement

Advertisement


Home > Politics - Political News

చేతికి మట్టి అంటకుండా పని చక్కబెట్టిన జగన్

చేతికి మట్టి అంటకుండా పని చక్కబెట్టిన జగన్

రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనపై తెలంగాణ సీఎం కేసీఆర్ డైరెక్ట్ ఫైట్ కి దిగితే.. ఏపీ సీఎం జగన్ తన చేతికి మట్టి అంటకుండా పని పూర్తి చేస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారులను ప్రజలముందుకు తెచ్చారు. సచివాలయాల్లో పనిచేసేందుకు గ్రేడ్-2 వీఆర్వోలను నియమించి పరోక్షంగా అప్పటివరకూ అధికారాలు వెలగబెడుతూ వచ్చిన గ్రేడ్-1 వీఆర్వోలకు చెక్ పెట్టారు.

గ్రేడ్-1 వీఆర్వోలకు కూడా సచివాలయ విధులు కేటాయించినా.. తహశీల్దార్ ఆఫీస్ వదిలి తాము రాబోమంటూ ఇన్నాళ్లూ వారు భీష్మించుకు కూర్చున్నారు. సచివాలయ ఉద్యోగులంతా బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ వేస్తుంటే.. వీఆర్వోలు మాత్రం ఫీల్డ్ వర్క్ పేరుతో తప్పించుకున్నారు. 

లంచాల పర్వాలన్నిటికీ తహశీల్దార్ ఆఫీసులే వేదిక కావడంతో అక్కడినుంచి వారు కదలకుండా ఉండేందుకు కొత్త ఎత్తులు వేశారు. కానీ సీఎం జగన్ వారికి పరోక్షంగా చెక్ పెట్టేశారు. వీఆర్వోలు ఇకపై తహశీల్దార్ ఆఫీస్ లకు రావద్దని పరోక్షంగా వారికి ఆదేశాలు జారీ అయ్యాయి.

మరోవైపు గ్రామ సచివాలయాల్లోనే వీఆర్వోలకు కూడా బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ సీసీఎల్ఏ రెండు రోజుల క్రితం ఉత్తర్వులిచ్చింది. దీంతో గ్రేడ్-1 వీఆర్వోలకు కూడా బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అయింది. ఎమ్మార్వో ఆఫీస్ లకు వద్దంటున్నారు, సచివాలయాలకు రాకపోతే ఊరుకునేలా లేరు. దీంతో గ్రామాల్లో పెత్తనం చెలాయించిన వీఆర్వోలంతా ఇప్పుడు సచివాలయాల డ్యూటీలకు వెళ్తున్నారు.

రైతుల్ని వేధించుకుని తమ చుట్టూ తిప్పించుకున్నవారంతా.. ఆన్ లైన్లో పాస్ బుక్ లు, అడంగల్ కరెక్షన్ల వ్యవహారాన్ని తప్పించుకోలేక గిలగిల్లాడిపోతున్నారు. నిర్దిష్ట పనిదినాల లోపు రైతులు పెట్టుకున్న అర్జీ పరిష్కారం కాకపోతే.. సరైన కారణం చెప్పాలి, లేకపోతే కచ్చితంగా ఆ పని చేసి పెట్టాలి. ఈ నియమాలన్నిటితో ఏపీలో రెవెన్యూ వ్యవస్థలో సంపూర్ణ ప్రక్షాళణ మొదలైంది.

కేసీఆర్ లాగా నేరుగా వేటు వేయకపోయినా.. పరోక్షంగా తోకల్ని కత్తిరించారు సీఎం జగన్. తహశీల్దార్ ఆఫీసుల్లో జరిగే పంచాయితీలకు చెక్ పెట్టేశారు. సచివాలయాలే అసలైన ప్రజా సేవా కూడళ్లుగా మార్చేశారు. 

లేని పోని ఇబ్బందులు అనే ఆలోచనా?

ప్రభుత్వం న్యాయ వ్యవస్థ చేతుల్లో ఉందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?