Advertisement

Advertisement


Home > Politics - Political News

పారిశ్రామిక విధానం.. జగన్ మార్క్ సుస్పష్టం

పారిశ్రామిక విధానం.. జగన్ మార్క్ సుస్పష్టం

నిజాయితీగా ఉండాలి..ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి..అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి జగన్ దారి ఇదే. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ.. నిజాయితీగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ప్రవేశపెట్టనున్న పారిశ్రామిక విధానంలో కూడా ఇదే పద్ధతి ఫాలో అవ్వాలని జగన్ నిర్ణయించారు. పరిశ్రమలు స్థాపించడానికి వచ్చేవాళ్లకు ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలని అందరికీ సూచించారు. అదే ప్రభుత్వ విధానమని కూడా స్పష్టంచేశారు.

సరికొత్త పారిశ్రామిక విధానం, అనుమతులకు సంబంధించి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. పరిశ్రమల స్థాపన కోసం వచ్చే పారిశ్రామికవేత్తలతో నిజాయితీగా ఉండాలని సూచించారు. గత ప్రభుత్వం మాదిరిగా సింగిల్ విండో అని చెప్పి మోసపూరితంగా మాట్లాడకుండా.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలని సూచించారు. నీరు, విద్యుత్, భూమి విషయంలో ఎంతవరకు సాధ్యం అవుతుందో ఆ మేరకు మాత్రమే మాటివ్వాలని, ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలని జగన్ సూచించారు.

త్వరలోనే ప్రవేశపెట్టనున్న పారిశ్రామిక విధానంలో నిజాయితీ, నిష్పక్షపాతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. మరోవైపు 75 శాతం ఉద్యోగాల్ని స్థానికులకు మాత్రమే ఇవ్వాలనే నిబంధనకు అంగీకరిస్తేనే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టనున్నారు. పరిశ్రమలకు ఏ తరహా నైపుణ్యం కావాలనుకుంటే.. ఆ నైపుణ్యాన్నే పెంపొందించుకునేలా యువతకు శిక్షణనిచ్చి మరీ పరిశ్రమలకు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పరిశ్రమలు, పెట్టుబడులు తక్కువగా వచ్చే అవకాశం ఉందని.. అయినప్పటికీ మాట మీద నిలబడాలని సూచించారు. ఎప్పుడైతే పరిశ్రమలు-నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు వందశాతం అనుసంధానమవుతాయో అప్పుడిక ఆటోమేటిగ్గా పరిశ్రమలన్నీ ఆంధ్రాకు వస్తాయని జగన్ ఆశాభావం వ్యక్తంచేశారు.

మొత్తమ్మీద నూతన పారిశ్రామిక విధానంలో కూడా జగన్ తన మార్క్ చూపించబోతున్నారు. పారదర్శకత అంటే ఎలా ఉంటుందో.. అసలైన సింగిల్ విండో పాలసీ ఎలా పనిచేయబోతోందో... ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు త్వరలోనే చూడబోతున్నారు. 

గృహ‌మే లేకుండా ప్ర‌జ‌ల‌తో గృహ ప్ర‌వేశం చేయించిన ఘ‌నుడు చంద్ర‌బాబు

8 నుంచి శ్రీవారి దర్శనం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?