Advertisement

Advertisement


Home > Politics - Political News

జయహో జగన్: ఢిల్లీ లెవల్లో బొమ్మ దద్దరిల్లింది

జయహో జగన్: ఢిల్లీ లెవల్లో బొమ్మ దద్దరిల్లింది

జగన్ డైనమిక్ సీఎం, ఏపీని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రశంసించిన రెండు రోజులకే.. ప్రధాని నరేంద్రమోదీ కూడా జగన్ పాలనపై ప్రశంసల జల్లు కురిపించారు. ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రధాని మోదీ సీఎం జగన్ ని పొగడ్తల్లో ముంచెత్తారు.

అజెండా కొవిడ్ నియంత్రణ చర్యలకు సంబంధించినదే అయినా.. రాష్ట్రంలోని సచివాలయ వ్యవస్థని ప్రస్తావించారు ప్రధాని మోదీ. ఇదే విధానాన్ని మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేస్తాయని భావిస్తున్నట్టు చెప్పారు. ప్రజలందరికీ త్వరితగతిన సేవలు అందుతున్నాయని ఆయన వైసీపీ ప్రభుత్వ పనితీరుని మెచ్చుకున్నారు. 

తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి వచ్చి కూడా జగన్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనడం అభినందనీయం అన్న మోదీ.. "మీ ద్వారా ఈరోజు నాకు వెంకటేశ్వర స్వామి దర్శనం అయినందుకు సంతోషంగా ఉంది" అని చెప్పారు.

ఏపీలో కొవిడ్ నుంచి కోలుకుని ఇంటికి వెళ్తున్నవారికి ఇస్తున్న ఆర్థిక సాయం, ప్లాస్మా దాతలకు ఇస్తున్న ప్రోత్సాహకంపై కూడా ప్రధాని మోదీ పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఏపీలో ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టినందుకు సీఎం జగన్ ని అభినందించారు. రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణ చర్యలను ఈ సందర్భంగా ప్రధాని మోదీకి వివరించారు సీఎం జగన్.

సంచార టెస్టింగ్ కేంద్రాలతో పరీక్షల సంఖ్యను పెంచామని, ఏపీలో మరణాల రేటు అత్యల్పం అని వివరించారు. దేశవ్యాప్తగ సగటుతో పోలిస్తే.. ప్రతి రోజూ కరోనా బారిన పడుతున్నవారి కంటే.. కోలుకుని ఇంటికి వెళ్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉందని.. ఏపీలో కరోనా పూర్తిస్థాయిలో కట్టడిలో ఉందని చెప్పారు. అన్ లాక్ మార్గదర్శకాలను కూడా అవసరానికి తగ్గట్టు మాత్రమే వినియోగించుకుంటున్నామని, పరిస్థితిని పూర్తిస్థాయిలో అదుపులోకి తెచ్చేందుకు కొన్నిచోట్ల ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయని చెప్పారు.

మొత్తమ్మీద ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో సీఎం జగన్ బాగా హైలెట్ అయ్యారు. సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం అంటూ మోదీ.. జగన్ ని ప్రశంసించడం మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై అనుకూల మీడియాతో విషం చిమ్మాలని చూసిన చంద్రబాబు.. ఈ ప్రశంసలను జీర్ణించుకోగలరా? ఏకాంతంగా జరిగిన మీటింగ్ గురించి ఎన్నో వక్రభాష్యాలు చెప్పిన పచ్చపాత మీడియా.. ఇప్పుడు మోదీ ప్రశంసలను ప్రస్తావిస్తుందా, లేక తన కుటిల బుద్ధిని వాడి దీన్ని కూడా వక్రీకరిస్తుందా?

డిక్లరేషన్ రాజకీయం ఫెయిలై.. తిరుమలలో పట్టువస్త్రాల సమర్పణ కన్నులపండువగా ముగిసింది. ఇటు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ వైసీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. టోటల్ గా ఈ రెండు ఎపిసోడ్స్ తో అనుకూల మీడియాతో సహా చంద్రబాబు మరోసారి సైలెంట్ అయ్యారు.

బాబు వందల గుళ్లు కూల్చేసినా ఓకేనా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?