Advertisement

Advertisement


Home > Politics - Political News

జ‌గ‌న్ ఎత్తుకు టీడీపీ చిత్తు

జ‌గ‌న్ ఎత్తుకు టీడీపీ చిత్తు

ఏపీ రాజ‌కీయాల‌ను బాగా గ‌మ‌నిస్తే కులాల చుట్టూ తిరుగుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ పార్టీలు కులాల ప్రాతిప‌దిక‌న చీలిపోయాయి. అందుకే పాల‌క ప్ర‌తిప‌క్ష పార్టీలు అభివృద్ధిపై కాకుండా కులాల చుట్టూ ఎక్కువ చ‌ర్చ చేస్తున్నాయి. ఏ చిన్న సంఘ‌ట‌న జ‌రిగినా వెంట‌నే కులం రంగు పూస్తూ రాజ‌కీయ ల‌బ్ధి పొందేందుకు శ‌త విధాలా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ విష‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కాస్త దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. అయితే టీడీపీ కుల ప్ర‌య‌త్నాలు అంత‌గా వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు.

ఈఎస్ఐ కుంభ‌కోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని, వైసీపీ నాయ‌కుడి హ‌త్య కేసులో మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌ను అరెస్ట్ చేసినా చంద్ర‌బాబుకు కుల‌మే క‌నిపిస్తోంది. వాళ్ల‌ద్ద‌రి అరెస్ట్ బీసీల అణ‌చివేత‌కే అని 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వ‌శాలి చంద్ర‌బాబు విమ‌ర్శిస్తున్నారు. మ‌చిలీప‌ట్నంలో హ‌త్య‌కు గురైన భాస్క‌ర్ కూడా బీసీ అని చంద్ర‌బాబు మ‌రిచిన‌ట్టున్నారు.

ఇక న‌ర్సీప‌ట్నం ప్ర‌భుత్వ డాక్ట‌ర్ సుధాక‌ర్‌, చిత్తూరు జిల్లా  పెనుమూరు ఆరోగ్య కేంద్రంలో ప‌నిచేసే డాక్ట‌ర్ అనితారాణి వ్య‌వ‌హారాల‌ను కూడా ద‌ళితుల‌పై దాడులుగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. డాక్ట‌ర్ సుధాక‌ర్ వ్య‌వ‌హార శైలి ఏంటో చానళ్ల‌లో ప్ర‌తి ఒక్క‌రూ చూశారు. అలాగే విచార‌ణ‌కు వెళ్లిన సీఐడీ అధికారుల‌తో డాక్ట‌ర్ అనితారాణి వ్య‌వ‌హ‌రించిన తీరు గురించి తెలిసిందే.

‘గోల్డ్ మెడల్ సాధించి డాక్టర్ అయిన ఓ దళిత బిడ్డపై వైసీపీ గుండాల దాష్టీకానికి పాల్పడ్డారు. జగన్ అమలు చేస్తున్న రాజారెడ్డి రాజ్యాంగంలో దళిత బిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. వైసీపీ నేతల అవినీతికి సహకరించలేదని దళిత మహిళా డాక్టర్ అనితా రాణిని వేధించడం దారుణం. మీ దిశ చట్టం దిశ తప్పిందా? అన్యాయం జరిగింది అంటూ ఒక దళిత చెల్లెలు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే దిశ చట్టం నిందితులకు కొమ్ముకాయడం ఘోరం’ అని నారా లోకేష్ ట్విట‌ర్ వేదిక‌గా కుల రాజ‌కీయం చేశార‌నేందుకు ఇదో ఉదాహ‌ర‌ణ‌.

తాజాగా సీఎం జ‌గ‌న్ వేసిన ఎత్తుగ‌డ టీడీపీని చిత్తు చేసేలా ఉంది. విజ‌య‌వాడ న‌గ‌రం న‌డిబొడ్డున స్వ‌రాజ్య మైదానం (పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌)లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యించింది. ఈనెల 8న సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విగ్రహం శంకుస్థాపన పనులు ప్రారంభించ‌నున్నారు. ఇందుకు సంబంధించి ప‌నుల‌ను క‌లెక్ట‌ర్ ఇంతియాజ్ ప‌ర్య‌వేక్షించారు.

రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సిద్ధాంతాలు, ఆలోచనలు ప్రతిబింబించేలా 125 అడుగుల విగ్రహం ఏర్పాటు, మెమోరి యల్‌ హాలు, మెమోరియల్‌ లైబ్రరీ, స్టడీ సెంటర్, ల్యాండ్‌ స్కేపింగ్, గార్డెన్‌ ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన‌ట్టు క‌లెక్ట‌ర్ తెలిపారు. కొన్ని నెల‌లుగా డాక్ట‌ర్ సుధాక‌ర్‌, డాక్ట‌ర్ అనితారాణిల‌ను అడ్డు పెట్టుకుని సాగిస్తున్న ద‌ళిత రాజ‌కీయానికి జ‌గ‌న్ కొట్టిన దెబ్బ..టీడీపీ అబ్బా అని అరిచేలా చేసింది. ద‌ళితులు దైవంగా భావించే అంబేడ్క‌ర్ అతిపెద్ద విగ్ర‌హం నెల‌కొల్ప‌డం కంటే వారు కోరుకునేది ఏముంటుంది? గ‌త ఐదేళ్ల‌లో ఈ ప‌ని చేయాల‌ని చంద్ర‌బాబుకు ఎందుకు ఆలోచ‌న రాలేదు. ఎందుకంటే ద‌ళితుల‌పై ఆయ‌న‌కు మాటల్లో త‌ప్ప చేత‌ల్లో ప్రేమ లేదు. 

తప్పు చెయ్యకపోతే ఎందుకు పారిపోయాడు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?