cloudfront

Advertisement


Home > Politics - Political News

కమ్మవాళ్ల కోటలో... జగన్‌కు పాగా..!

కమ్మవాళ్ల కోటలో... జగన్‌కు పాగా..!

కడప జిల్లాలో ప్రజాస్పందనను చూపిస్తే, అబ్బే అది కడప.. అన్నారు. రాయలసీమలోని మిగతా జిల్లాలో అదే స్థాయి జనాలే.. అంటే, అది రాయలసీమ అన్నారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు.. అంటే, అబ్బే అక్కడ రెడ్లు ఉన్నారు కాబట్టి.. అన్నారు. ఇప్పుడు జగన్ పాదయాత్ర కమ్మ వాళ్ల కోటలో సాగుతోంది. పైన అమ్మవారు, కింద కమ్మవారు అని సినిమాల్లో సైతం ప్రస్తావించిన విజయవాడలో జగన్ పాదయాత్రకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు.

కృష్ణాజిల్లాలోకి జగన్ ఎంట్రీనే అదిరిపోయింది. నాలుగేళ్ల నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు చాలా కష్టపడ్డాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనం అయ్యింది అని చెప్పడానికి ఆయన పడ్డకష్టం అంతాఇంతా కాదు. ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు, అనుకూల మీడియా చేత అలుపు లేకుండా దాడులు చేయించారు, తెలుగుదేశం నేతలు అనునిత్యం దుమ్మెత్తిపోశారు.

దాని ప్రయోజనాలు ఎక్కడ? ఇప్పుడు తెలుగుదేశం పార్టీని వీడి, జగన్ పార్టీలోకి కృష్ణాజిల్లా కమ్మవాళ్లే చేరుతున్నారు. ఇక స్థానిక కమ్మవాళ్ల నుంచి కూడా జగన్ పాదయాత్రకు సానుకూల స్పందనే వస్తోంది. చంద్రబాబు సంపాదించుకున్న వ్యతిరేకత స్థాయిని చాటి చెబుతోంది జగన్ పాదయాత్ర. అలాకాదు.. అని తెలుగుదేశం వాళ్లు అంటే, అది వాళ్లు వాళ్లను మోసం చేసుకోవడమే.

ఈ మధ్యనే అన్నాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించం అని. నిజమే.. ఈయన గుర్తింపు అవసరం లేకపోవచ్చు ఇక. త్వరలోనే ఎన్నికలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. కాబట్టి ఆ గుర్తింపు తెలుగుదేశం పార్టీకి దక్కేలా ఉంది పాదయాత్ర స్పందన.

ఇక విజయవాడ ఏరియాలో జగన్ పాదయాత్రకు వస్తున్న ప్రజాస్పందన పట్ల చంద్రబాబు ఎంత కలవరపడ్డాడు అంటే, అబ్బే అదంతా ఫేక్ అన్నాడట. ఫేక్ ఫొటోలు, ఫేక్ వీడియోలు అన్నాడట. జగన్ పాదయాత్ర ఫొటోలకే చంద్రబాబు స్పందిస్తున్నాడంటే, తన పార్టీ వాళ్ల మధ్యన వీటి గురించి చర్చిస్తున్నాడంటే.. దీనికి రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.