cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

వార‌సుల‌పై జ‌గ‌న్ ప్ర‌శంస‌లు

వార‌సుల‌పై జ‌గ‌న్ ప్ర‌శంస‌లు

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న పార్టీకి సంబంధించి యువ నేత‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. ఎవ‌రెవ‌రు, ఎక్క‌డెక్క‌డ పార్టీ కోసం ఏ విధంగా ప‌ని చేస్తున్నార‌నే విష‌య‌మై ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఇంటెలిజెన్సీ వ‌ర్గాల ద్వారా నివేదిక తెప్పించు కుంటున్నారు. 

జ‌నాల త‌ల‌లో నాలుక‌లా వ్య‌వ‌హ‌రించే వారిని వెన్నుత‌ట్టి ప్రోత్స‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న పార్టీకి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల వార‌సుల‌ను జ‌గ‌న్ అభినందించ‌డం గురించి పార్టీలో ప్ర‌త్యేకంగా చెప్పుకోవ‌డం విశేషం.

జ‌గ‌న్ అభినంద‌న‌లు అందుకున్న ఆ ఇద్ద‌రు వార‌సులు భూమ‌న అభిన‌య్‌రెడ్డి, బియ్య‌పు ప‌విత్రారెడ్డి. ఇద్ద‌రూ చిత్తూరు జిల్లాకు చెందిన యువ‌నేత‌లు. తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి త‌న‌యుడు అభిన‌య్‌రెడ్డి, శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి త‌న‌య ప‌విత్రారెడ్డి. 

ఇద్ద‌రు యువ నేత‌లు త‌మ‌త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌య్యారు. తండ్రుల వార‌స‌త్వంతో రాజ‌కీయంగా ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ, త‌మ చొర‌వ‌, క‌లుపుగోలు త‌నం, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌న్న ఉత్సాహం వారిని లీడ‌ర్లుగా తీర్చిదిద్దుతున్నాయి.

తిరుప‌తి ఎంపీగా డాక్ట‌ర్ గురుమూర్తి గెలుపొందిన అనంత‌రం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిశారు. సీఎంను క‌లిసిన వారిలో గురుమూర్తితో పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, నారాయ‌ణ‌స్వామి, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, కె.సంజీవ‌య్య‌, ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి త‌దిత‌రులున్నారు.

ఈ సంద‌ర్భంగా చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి తిరుప‌తి ఉప ఎన్నిక‌లో భాగంగా భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి త‌న‌యుడు అభిన‌య్‌రెడ్డి చురుగ్గా ప‌ని చేయ‌డంపై సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అన్నా తిరుప‌తిలో మెజార్టీ సాధించిన క్రెడిట్ అభిన‌య్‌కే ద‌క్కుతుంద‌ని సీఎంతో చెవిరెడ్డి అన్నారు. అభిన‌య్ రాజ‌కీయ వ్యూహ‌ప్ర‌తివ్యూహాలు బాగా ప‌నిచేశాయ‌ని జ‌గ‌న్ దృష్టికి చెవిరెడ్డి తీసుకెళ్లారు. 

చెవిరెడ్డి మాట‌ల‌ను  మంత్రులు, టీటీడీ చైర్మ‌న్‌, ఇత‌ర ఎమ్మెల్యేలు బ‌ల‌ప‌రిచారు. వారి మాట‌ల‌కు జ‌గ‌న్‌ శృతి క‌లుపుతూ ...అభిన‌య్ గ‌త ఎన్నిక‌ల్లో కూడా బాగా ప‌ని చేశాడ‌ని, తండ్రికి మించిన త‌న‌యుడిగా రాటుదేలుతున్నాడ‌ని ప్ర‌శంసా పూర్వ‌కంగా అన్నారు. 

ఇదే సంద‌ర్భంలో తిరుప‌తి ప‌క్క‌నే ఉన్న శ్రీ‌కాళ‌హ‌స్తిలో కూడా బియ్య‌పు మ‌ధు కూతురు ప‌విత్ర కూడా చాలా యాక్టీవ్‌గా ప‌ని చేస్తోంద‌ని స్వ‌యంగా సీఎం అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. వీళ్లిద్ద‌రికీ మంచి భ‌విష్య‌త్ ఉంద‌ని జ‌గ‌న్ అంద‌రి ఎదుట అన‌డం విశేషం. అక్క‌డే ఉన్న అభిన‌య్‌ని సీఎం ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించారు.

ఇదిలా ఉండ‌గా శ్రీ‌కాళ‌హ‌స్తిలో ఎమ్మెల్యే కూతురిగా కంటే, ప‌విత్ర తండ్రిగా బియ్య‌పు మ‌ధును గుర్తిస్తార‌ని ఆ 23 ఏళ్ల యువ‌తి ప్ర‌జ‌ల‌తో ఎంత‌గా మ‌మేకం అయ్యారో అర్థం చేసుకోవ‌చ్చు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను ప‌విత్ర ఒంటి చేత్తో న‌డిపించారంటే అతిశ యోక్తి కాదు. 

ఇక భూమ‌న అభిన‌య్‌రెడ్డి విష‌యానికి వ‌స్తే ...తిరుప‌తిలో 2009 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు ఎన్నిక‌ల బాధ్య త‌ల‌ను త‌న భుజాన వేసుకుని న‌డిపించారు. 2009 సార్వ‌త్రిక ఎన్నిక‌లు, 2012 ఉప ఎన్నిక‌లు, 2014, 2019, ఇటీవ‌ల తిరుప‌తి కార్పొరేష‌న్ ఎన్నిక‌లు, తాజాగా తిరుప‌తి పార్ల‌మెంట్ ఉప ఎన్నిక‌లో తండ్రి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న తిరుప‌తి అసెంబ్లీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త 33 ఏళ్ల అభిన‌యే. భ‌విష్య‌త్‌లో వైసీపీ నుంచి ఇద్ద‌రు యువ ప్ర‌జాప్ర‌తినిధుల‌ను చూసే అవ‌కాశం ఉంది.

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×