Advertisement

Advertisement


Home > Politics - Political News

కెవ్వు కేక.. చంద్రబాబుపై జగన్ పంచ్ అదుర్స్

కెవ్వు కేక.. చంద్రబాబుపై జగన్ పంచ్ అదుర్స్

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై అసెంబ్లీ వేదికగా జగన్ పంచ్ లు వేయడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే చంద్రబాబుకు చాకిరేవు పడింది. "కళ్లు పెద్దవి చేసి చూస్తే ఇక్కడెవ్వరూ భయపడరు" అంటూ బాబు గాలి తీసేశారు జగన్. ఇప్పుడు అలాంటిదే మరో ఎపిసోడ్ తెరపైకొచ్చింది. ఇది చాకిరేవు పార్ట్-2.

అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా సభలో చంద్రబాబు చేసిన రచ్చ అంతా చూశాం. ఎప్పట్లానే కళ్లు పెద్దగా చేశారు. వేలు చూపించి బెదించారు. ఏం పీకుతావ్ అంటూ అన్-పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వాడారు.

ఈ మొత్తం ఎపిసోడ్ కు తనదైన శైలిలో చెక్ పెట్టారు ముఖ్యమంత్రి జగన్. చంద్రబాబుకు పై కంపార్ట్ మెంట్ లో సెన్స్ లేదన్నారు జగన్. ముఖ్యమంత్రి ఉద్దేశంలో పై కంపార్ట్ మెంట్ అంటే బ్రెయిన్ అని అర్థం.

"మాట్లాడేప్పుడు పై-కంపార్ట్ మెంట్ (బుర్ర)లో సెన్స్ ఉండాలి. ఎన్యుమరేషన్ (లెక్కింపు) ఓవైపు జరుగుతోంది. డిసెంబర్ 30 లోపు ఏ సీజన్ లో ఇవ్వాల్సిన ఇన్-పుట్ సబ్సిడీని అదే సీజన్ లో ఇచ్చే గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. అంటే నెల తిరక్కముందే రైతుల చేతుల్లో డబ్బులు పెట్టబోతున్నాం. ఇంత చెబుతున్నా ఆయనకు (బాబు) అర్థం కావడం లేదు. పై కంపార్ట్ మెంట్ (బుర్ర)లో ఖాళీ స్థలం తప్ప ఏమీ లేదు."

ఇలా చంద్రబాబు ఓవరాక్షన్ కు ఒక్క డైలాగ్ తో ఫుల్ స్టాప్ పెట్టారు జగన్. అప్పుడే సోషల్ మీడియాలో ఈ "పై కంపార్ట్ మెంట్" అనే పదం వైరల్ అయిపోయింది. ఈ పదప్రయోగంతో చంద్రబాబుపై పదుల సంఖ్యలో ఎమోజీలు పుట్టుకొచ్చాయి. 

ఇలా మొదటి రోజే ముఖ్యమంత్రి జగన్ తన పంచ్ లకు పదునుపెట్టారు. రాబోయే రోజుల్లో చంద్రబాబుపై జగన్ తరహా పంచ్ లు మరిన్ని పేలడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే, బాబు ఎత్తుకున్న అంశాలు అలా ఉన్నాయి మరి.

ఇక నష్టపరిహారం, ధాన్యం కొనుగోలు విషయానికొస్తే.. కేవలం రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా మొలకలెత్తిన ధాన్యం కూడా వదిలిపెట్టకుండా, గ్రేడెట్ పద్ధతిలో కొనుగోలు చేసి రైతులకు పూర్తి న్యాయం చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 

అంటే రైతులకు రవ్వంత నష్టం కూడా జరగన్నమాట. అయినా కూడా చంద్రబాబు లేనిపోని రాద్దాంతం చేస్తున్నారంటే నిజంగా ఆయన పై కంపార్ట్ మెంట్ లో గుజ్జు లేనట్టే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?