cloudfront

Advertisement


Home > Politics - Political News

జగన్ టిక్కెట్ ఇస్తానంటే వద్దన్నాను

జగన్ టిక్కెట్ ఇస్తానంటే వద్దన్నాను

"నేను వైఎస్ఆర్సీ పార్టీలో ఎమ్మెల్యేగా నిలబడను. ఎంపీగా కూడా నిలబడను. ఎమ్మెల్సీగా కూడా చేయను. ఆయన (జగన్) నన్ను అడిగారు. ఏ టిక్కెట్టు వద్దన్నాను. జగన్  కు సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి ఎమ్మెల్యే పోస్టు ఆశిస్తున్నానని మీరు అనుకోవచ్చు. నా జీవితంలో నేను ఎమ్మెల్యేగా నిలబడను. జగన్ కు అదే మాట చెప్పాను." 

తన రాజకీయ ప్రస్థానంపై ఇలా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు పోసాని కృష్ణమురళి. అంతా అనుకుంటున్నట్టు తను రాజకీయాల్లోకి వెళ్లడం లేదని, కేవలం జగన్ మంచితనం నచ్చి, అతనికి మద్దతు ఇస్తున్నానని తెలిపారు. 

"కేవలం జగన్ అంకితభావాన్ని మాత్రమే చూశాను. ఆయన మెంటాలిటీ, ఆయన సమర్థత నాకు నచ్చింది. నేను ఆయన ఫాలోవర్ ను మాత్రమే. నాకు ఎలాంటి పదవులు అక్కర్లేదు."

రుణమాఫీ విషయంలో జగన్ తనకు బాగా నచ్చాడంటున్నారు పోసాని. గత ఎన్నికల్లో కేవలం రుణమాఫీ అంశంపైనే తను ఓడిపోయాననే విషయం జగన్ కు తెలుసని, అయినప్పటికీ ఇప్పటికీ ఆచరణ సాధ్యంకాని రుణమాఫీ చేస్తానని జగన్ చెప్పడం లేదన్నారు. అది తనకు బాగా నచ్చిందంటున్నారు పోసాని.

"రుణమాఫీ చేస్తానని చెప్పలేదు. అందుకే ఓడిపోయానని నాతో జగన్ అన్నారు. అది సాధ్యం కాదు కాబట్టి ప్రజలకు చెప్పలేదు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల తిట్లు తినడం తనకు మంచిది కాదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఏం చేయగలనో అదే చేస్తానన్నారు. అదే ప్రజలకు చెబుతున్నారు. మళ్లీ ఓడిపోయినా సరే రుణమాఫీ చేస్తానని చెప్పను. ఎందుకంటే అది సాధ్యం కాదన్నారు జగన్. ఇది నాకు బాగా నచ్చింది."

తనకు ముఖ్యమంత్రి పదవి కావాలి కానీ అది తప్పుడు మార్గంలో వద్దు, నిజాయితీగా తనకు ఆ పదవి రావాలి అని కోరుకునే వ్యక్తిని జగన్ ను మాత్రమే చూశానంటున్నారు పోసాని.