cloudfront

Advertisement


Home > Politics - Political News

జనంలోకి జగన్.. రూట్ మ్యాప్ ఖరారు

జనంలోకి జగన్.. రూట్ మ్యాప్ ఖరారు

దాదాపు ఏడాదిన్నరగా ప్రజల్లోనే ఉంటున్నారు జగన్. ప్రజాసంకల్పయాత్ర పేరిట అతడు చేపట్టిన చారిత్రక పాదయాత్ర నభూతో అనే రీతిలో సాగింది. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. అది పూర్తయిన వెంటనే, సమర శంఖారావాలు ఏర్పాటుచేశారు జగన్. ఈసారి కూడా ఏదో ప్రసంగించి వెళ్లిపోకుండా, ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వాళ్ల మధ్య ఉండడానికే ప్రాధాన్యం ఇచ్చారు.

ఇప్పుడు మరోసారి జనంలోకి వెళ్లబోతున్నారు జగన్. ఎన్నికల వేళ సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ మేరకు జగన్ ప్రచారానికి సంబంధించిన కార్యాచరణ సిద్ధమైంది. రేపట్నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు జగన్. ఇడుపులపాయలో దివంగత వైఎస్ఆర్ కు నివాళులు అర్పించి, ప్రచారాన్ని ప్రారంభించనున్న జగన్.. 20వ తేదీ వరకు రోజుకు 3 సభల్లో పాల్గొంటారు.

ప్రచారం రెండోదశలో భాగంగా 21వ తేదీ నుంచి ఏప్రిల్ 1వరకు రోజుకు 4 సభల్లో పాల్గొంటారు. ఏప్రిల్ 1 నుంచి రోజుకు 5 సభల్లో పాల్గొనేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రచార సభల్లో జగన్ తో పాటు విజయమ్మ, షర్మిళ కూడా పాల్గొంటారు. ప్రజాసంకల్పయాత్రలో కవర్ చేయలేకపోయిన ప్రాంతాల్ని ప్రచారంలో కవర్ చేయబోతున్నారు జగన్.

నిజానికి తొలివిడత అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత బస్సుయాత్ర చేపట్టాలని జగన్ భావించారు. కానీ సమయం తక్కువగా ఉన్న కారణంతో బస్సుయాత్ర చేయాలనే ఆలోచన నుంచి విరమించుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో సుడిగాలి పర్యటనలు చేపట్టాలని డిసైడ్ అయ్యారు. జగన్ తొలి ప్రచార సభ గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్లలో ఉంటుంది.

ఇవాళ ఉదయం జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హాఠాత్తుగా మరణించడంతో ఈ షెడ్యూల్ లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది.

చంద్రబాబు చేసిందే నేను చూపిస్తున్నా.. వర్మ

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!