cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ జ‌గ‌న్ స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మైంది. కోవిడ్ నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో ఎల్లుండి నుంచి పాక్షిక క‌ర్ఫ్యూ, ఆంక్ష‌లు అమ‌ల్లోకి రానున్నాయి. 

ఉద‌యం 6 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కే దుకా ణాలు తెరిచేందుకు అనుమ‌తి ఇచ్చారు. రెండు వారాల పాటు ఈ ఆంక్ష‌లు కొన‌సాగ‌నున్న‌ట్టు వైద్యారోగ్య‌శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇప్ప‌టికే ఏపీలో ప‌లు న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో కోవిడ్ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆంక్ష‌లు విధించారు. 

ఉదాహ‌ర‌ణ‌కు తిరుప‌తిలో ఇప్ప‌టికే ఆంక్ష‌లున్నాయి. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కే దుకాణాలు తెరిచేలా స్థానిక ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, న‌గ‌ర మేయ‌ర్ శిరీష‌, క‌మిష‌న‌ర్ గిరీషా త‌దిత‌రులు నిర్ణ‌యించారు. అలాగే ఇత‌ర ప్రాంతాల్లో కూడా ప‌రిస్థితుల‌ను బ‌ట్టి లోక‌ల్ లీడ‌ర్స్ క‌ట్ట‌డి చ‌ర్య‌లు చేప‌ట్టారు.

తాజాగా కొవిడ్‌ నియంత్రణపై సీఎం జగన్‌ మంత్రులు, సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని వివరించారు. 

కొవిడ్‌ నివారణ చర్యలతో పాటు ఆస్పత్రుల్లో బెడ్లు పెంచాలని అధికారులకు సీఎం ఆదేశించినట్లు ఆయన వివరించారు. నిర్ణీత సమయాల్లో కర్ఫ్యూ విధించాలని సూచించారన్నారు. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×