Advertisement

Advertisement


Home > Politics - Political News

జగన్ విజయానికి ఇది మరో ఉదాహరణ

జగన్ విజయానికి ఇది మరో ఉదాహరణ

వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలు, వాలంటీర్ వ్యవస్థతో జరిగిన మేలు కంటే.. ఇబ్బందులే ఎక్కువ అంటున్న ప్రతిపక్షాలు ఇప్పటికైనా కళ్లు తెరవాల్సిన సందర్భం ఇది. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై ప్రధాని నరేంద్రమోదీ సహా ఇతర కేంద్రమంత్రులు కూడా చాలా సందర్భాల్లో ప్రశంసలు జల్లు కురిపించారు. కరోనా కష్టకాలంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిందంటే దానికి కారణం ఏపీనే.

ఇప్పుడు తాజాగా.. అసోంలో వాలంటీర్ల వ్యవస్థను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతోంది. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ షేక్ ఆరిజ్ అహ్మద్.. ఏపీ పర్యటనలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల పనితీరుపై అధ్యయనం చేస్తున్నారు. తన రిపోర్ట్ ని అతి త్వరలో అసోం ప్రభుత్వానికి సమర్పిస్తానని, అక్కడ కూడా సచివాలయం-వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్టు ఆయన తెలిపారు.

ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల పోస్ట్ లకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు, నియామక ప్రక్రియ, జీత భత్యాలు, వారి విధులు.. ఇలా అన్ని అంశాలను నేరుగా సిబ్బందిని అడిగే తెలుసుకున్నారు. సిబ్బంది పనితీరుని స్వయంగా పరిశీలించారు.

గ్రామాల్లో అందుతున్న సేవలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ప్రైవేటే ఇంటర్నెట్ సెంటర్లను ఆశ్రయించకుండా.. నేరుగా సచివాలయానికి వచ్చి ప్రభుత్వ సిబ్బందితోనే పని చేయించుకుంటున్న తీరుని చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పరిపాలనలో పారదర్శకత, కచ్చితత్వం, వేగం.. సచివాలయ వ్యవస్థ ద్వారా సాధ్యమవుతుందని అసోం ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారు.

ఏపీ సీఎం జగన్ తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయం దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంది. ఇటీవలే.. ప్రధాని నరేంద్ర మోదీ కూడా సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కరోనా కట్టడికి ఏపీ బాగా కృషిచేసిందని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ఇన్ని ప్రశంసలు లభిస్తుంటే.. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు మాత్రం ఇంకా వాలంటీర్ వ్యవస్థపై పడి ఏడవటం మాత్రం విడ్డూరం. 

పవన్ సినిమా పోలిటిక్స్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?