Advertisement

Advertisement


Home > Politics - Political News

జగన్ ది ఉక్కు సంకల్పమే...

జగన్ ది ఉక్కు సంకల్పమే...

వైఎస్ జగన్ అంటే ఒక బ్రాండ్ అని అందుకే అంటారు. ఆయన మాట తప్పరు అన్నది కూడా నిజమని మరోసారి రుజువు చేసుకున్నారు. 

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయవద్దు అంటూ శాసనసభలో తీర్మానం పెట్టి కేంద్రానికి పంపించడం ద్వారా జగన్ తన ఉక్కు సంకల్పం ఏంటి అన్నది తెలియచేశారు.

దీని మీద ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు విమర్శలు చేస్తూ వచ్చారు. విశాఖ ఉక్కు మీద అసెంబ్లీ తీర్మానం పెట్టే సత్తా ఉందా అంటూ మాట్లాడారు. 

కొందరు విపక్ష నేతలు అయితే అసలు తీర్మానం పెట్టరని కూడా ముందే జోస్యం చెప్పేశారు. అయితే జగన్ వారందరి ఆలోచనలను, అంచనాలను తల్లకిందులు చేస్తూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడే విషయంలో తన చిత్త శుద్ధి ఏంటి అన్నది స్పష్టంగా చెప్పారు.

మూడు నెలల క్రితం విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి నాడు  ఉక్కుకు సంబంధించిన 23 మంది కార్మిక సంఘాల నాయకులకు ఇచ్చిన మాట ప్రకారం శాసనసభలో తీర్మానం చేశారు. కేంద్రానికి కూడా రెండు సార్లు లేఖ రాసి సమయం ఇస్తే తాము అఖిలపక్షంతో వచ్చి కలుస్తామని కూడా చెప్పారు. 

మొత్తానికి ఇపుడు బంతి కేంద్రం కోర్టులో ఉంది. దాంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని జగన్ తో ముడిపెట్టి చెడ్డ చేయాలనుకున్న విపక్షాలకు అసెంబ్లీ తీర్మానం ఒక విధంగా షాక్ అనే చెప్పాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?