Advertisement

Advertisement


Home > Politics - Political News

జనసేన దొడ్డిదారి పోరాటం

జనసేన దొడ్డిదారి పోరాటం

'' ప్రయివేటు బతకులు మీ సొంతం...పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం..''

ఈ మాటలు ఎవరో అణా కానీ మనిషి అన్నవి కాదు. ప్రతి ఒక్కరు మహాకవి అని కీర్తించే కవి శ్రీశ్రీ రాజకీయ నాయకులను ఉద్దేశించి అన్నవి. మహా కవి శ్రీశ్రీ ఏమైనా అంటాం అని అంటే అని వుండొచ్చు. పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం అని శ్రీశ్రీ అనడం నిలదీస్తాం అని అర్థం. అయితే వర్తమాన మీడియా రాజకీయ నాయకులను నిలదీయడంలో కాస్త సంయమనం పాటిస్తూనే వుంది. 

పార్టీల బంధాలు వున్న మీడియాలను పక్కన పెడితే, మిగిలిన మీడియా సంస్థలు పాయింట్ దొరికితే రాజకీయ పార్టీలను, రాజకీయ నాయకులను నిలదీస్తూనే వున్నాయి. వారి తప్పదాలను ఎత్తి చూపుతూనే వున్నాయి.

చంద్రబాబు అయినా, జగన్ అయినా, పవన్ అయినా వారి పార్టీలు అయినా తప్పు వుంటే ఎత్తి చూపడంలో గ్రేట్ ఆంధ్ర ఎప్పడూ ముందు వుంటూ వస్తోంది. ఇలాంటి నేపథ్యంలో జనసేన డిజిటల్ మీడియా విభాగం ఈ పరిస్థితిని జీర్ణించుకోలేకపోతోంది. గ్రేట్ ఆంధ్రను ఎలాగైనా దెబ్బతీయాలని దొడ్డి దారిపోరాటం ప్రారంభించింది.

ట్విట్టర్, యూ ట్యూబ్ ల నిబంధనలు, పని వ్యవహారాలు అడ్డం పెట్టుకుని గ్రేట్ ఆంధ్రను అడ్డుకోవాలని చూస్తోంది. యూ ట్యూబ్ లో స్ట్రయికింగ్ అనే రూలును అడ్డం పెట్టుకుని గ్రేట్ ఆంధ్ర చానెల్ ను బ్లాక్ చేయాలని ప్రయత్నిస్తోంది. సిల్లీ రీజన్ల, చెల్లని రీజన్లతో యూ ట్యూబ్ కు రిపోర్ట్ చేస్తోంది. ఆ రీజన్లు ఎంత సిల్లీగా వున్నాయో ఇక్కడ చూద్దాం.

ఆ మద్య పవన్ ఆంధ్ర పర్యటనకు వెళ్లారు. ' మీ సిఎమ్ కు చెప్పండి..ఈ వకీల్ సాబ్ చబుతున్నాడు' అని అంటూ స్పీచ్ ఇచ్చారు. రోడ్ షో నిర్వహించారు. అది పబ్లిక్ గా జరిగింది. దాన్ని ఎవరైనా విడియో తీయొచ్చు. యూ ట్యూబ్ లో లోడ్ చేసుకోవచ్చు. కానీ జనసేన డిజిటల్ వింగ్ ఈ విడియో తమ స్వంతం అని యూ ట్యూబ్ కు ఫిర్యాదు చేసింది. 

అలాగే మరో సారి చేసిన ఫిర్యాదు చూద్దాం. నిర్మాత బన్నీ వాస్ ను గ్రేట్ ఆంధ్ర ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన తనను పవన్ పాలకొల్లు నుంచి పోటీ చేయమన్నారు అని చెప్పారు. ఆ సందర్భంగా పవన్ ఫొటో అక్కడ వాడడం జరిగింది. ఇప్పుడు అది కూడా తమకు అభ్యంతరం అంటూ జనసేన డిజిటల్ మీడియా యూ ట్యూబ్ కు ఫిర్యాదు చేసింది. 

ఈ రెండు సంఘటనల్లో జనసేన ఫిర్యాదుల్లో ఎంత పస వుందో జనాలకే అర్థం అయిపోతోంది. అది వారికీ తెలుసు. కానీ వారి ఐఢియా అది కాదు. ఇలాంటి వాటికి గూగుల్ యూ ట్యూబ్ పెద్దగా తను ఇన్ వాల్వ్ కాదు. మీరు మీరు కోర్టులో చూసుకోండి అంటుంది. అంతకు వరకు చానెల్ ను అబేయన్స్ లో పెట్టాలని చూస్తుంది. ఈ పద్దతిని అవకాశంగా తీసుకోవాలని చూస్తోంది జనసేన డిజిటల్ మీడియా విభాగం.  అలా అయితే యూ ట్యూబ్ లో ఒక్క చానెల్ కూడా పని చేయలేదు. బాబు, లోకేష్, జగన్, పవన్ ఇలా వర్తమాన రాజకీయ నాయకుల వార్తలు ఫొటొలు యూ ట్యూబ్ చానెళ్ల నిండా వుంటాయి. వైకాపా, తేదేపా సోషల్ మీడియా, డిజిటల్ మీడియ విభాగాలు ఇలాంటివి ఎన్నడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. 

కానీ జనసేన విభాగం మాత్రం క్రిటిసిజమ్ ను భరించలేకపోతోంది. వాడితే పాజిటివ్ గానే వుంటాలి. లేదూ అంటే అస్సలు వాడడానికి లేదు అనే ఆలోచనా ధోరణిలో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అంత మాత్రం చేత గ్రేట్ ఆంధ్ర వెనక్కు తగ్గేది లేదు. సునిశతమైన విమర్శలు ఆపేదీ లేదు. ఇందుకోసం అవసరం అయితే న్యాయపోరాటం చేయడానికి కూడా వెనుకాడేదీ లేదు.

విడియోలను తాత్కాలికంగా ఆపగలరేమో కానీ కలాలను కట్టడి చేయలేరు కదా..రాతలు చెరిపివేయలేరు కదా..పవన్ ఫోటో ఎక్కడ కనిపించినా అది తమ ప్రాపర్టీ అనే జనసేన డిజిటల్ వింగ్, ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల ఫొటోలు  మాత్రం ఎందుకంత ప్రచారం సాగిస్తోంది. అంటే ఆయన సినిమాలకు ఒక రూలు, ఆయన రాజకీయాలకు మరో రూలు అన్నమాట. 

అక్కడే అర్తమైపోతోంది పవన్, ఆయన పార్టీ, ఆయన డిజిటల్ మీడియా వింగ్ ల ద్వంద వైఖరి.

లోకేశ్ ప్ర‌తిమాట ఆణిముత్య‌మే

హైకోర్టుకు నిమ్మ‌గ‌డ్డ సారీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?