cloudfront

Advertisement


Home > Politics - Political News

జయరాం హత్య కేసు.. టీవీ యాంకర్ ను ఎరగా!

జయరాం హత్య కేసు.. టీవీ యాంకర్ ను ఎరగా!

పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు సవ్యంగా సాగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ హత్య కేసు విచారణలో బయటివారి ఇన్ వాల్వ్ మెంట్లు చాలానే కనిపిస్తున్నాయి. జయరాం అనే ఆ వ్యక్తిని హత్య చేశారు, ఒకరోజు తర్వాత దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయం తేలింది. ఎవరు హత్య చేశారు? అనే అంశాన్ని తేల్చడానికి తమకు రెండు రోజుల సమయం చాలని మొదట పోలీసులు ప్రకటించారు. ఆ మేరకు వారి విచారణ అయితే వేగవంతంగా సాగినట్టుగా తెలుస్తోంది.

కానీ.. చాలామంది ఈ విషయంలోకి చొరబడినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులను రక్షించడానికి బయటివాళ్లు ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో జయరాం మేనకోడలు శిఖా చౌదరి పాత్ర ఉందని మొదటి నుంచి వార్తలు వచ్చాయి. ఆమెతో జయరాంకు అక్రమ సంబంధం ఉందని విచారణలో తేలిందట. ఆ విషయాన్ని ఆమె కూడా అంగీకరించిందట. అయితే ఆమె వేరే తరహాలో చెప్పిందని తెలుస్తోంది. తనను, తన సోదరిని జయరాం లైంగికంగా వేధించే వాడని ఆమె పోలీసులకు వివరించినట్టుగా సమాచారం.

ఈ శిఖా చౌదరికి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయినట్టుగా తెలుస్తోంది. రెండో భర్త నుంచి ఈమె విడాకులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయట. ఇక రాకేష్ రెడ్డి అనే అతడు ఈమె ప్రియుడిగా తెలుస్తోంది. అయితే హత్య జరిగిన రోజు ఈమె శ్రీకాంత్ అనే వ్యక్తితో వికారాబాద్ కు లాంగ్ డ్రైవ్ వెళ్లిందట. ఈ విషయాలను ఈమె పోలీసులకు వివరించినట్టుగా తెలుస్తోంది. తనకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని ఆమె అంటోంది.

అయితే శిఖా చౌదరికి సంబంధించిన కొన్ని ఆస్తి డాక్యుమెంట్లు జయరాం వద్దనే ఉన్నాయని, వాటి కోసమే తను హత్య జరిగిన రోజు ఆయన ఇంటి వద్దకు వెళ్లినట్టుగా ఆమె చెప్పిందట. ఇక రాకేష్ రెడ్డే ఈ హత్య చేశాడు.. శిఖా చౌదరి దీనివెనుక ఉంది.. అనేది పోలీసులు అనుమానిస్తున్న విషయం. సదరు  రాకేష్ రెడ్డి ఎవరు? అంటే... ఇతడికి పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు ఉన్నాయని, ఏపీ ప్రభుత్వంలో పలుకుబడి ఉందని తెలుస్తోంది.

ఏపీ మంత్రి లోకేష్ కు సన్నిహితుడు అయిన అభీష్టకు ఇతడు సన్నిహితుడని.. రాకేష్ రెడ్డి తిరుమలకు ఫోన్ చేసినా.. వీఐపీ దర్శనం లభించేంత పట్టుందని అంటున్నారు. ఆ విశ్వాసంతోనే ఇతడు జయరాంను హత్య చేసి.. పోలీసులను మేనేజ్ చేయవచ్చని అనుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే జయరాంను హత్య చేయాల్సిన అవసరం రాకేష్ కు ఏంటి? అనే విషయం గురించి పూర్తి వివరాలు బయటకు రావడంలేదు.

బయటకు వచ్చిన వివరాలు నమ్మశక్యంగా లేవు. ఇక ఈ కేసులో శిఖా చౌదరిని కాపాడటానికి ‘కబాలి’ సినిమా తెలుగు నిర్మాత రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. శిఖా చౌదరి చాలా మంచి అమ్మాయని ఆయన సర్టిఫికెట్ ఇస్తున్నాడట. ఇక హత్య జరిగిన రోజు ఒక టీవీ యాంకర్ ను జయరాం కోసం ఏర్పాటు చేశాడట రాకేష్. ఈ విషయాన్ని ఆయన పోలీసులకు వివరించాడట.

ఇదంతా వింటుంటే.. ఇదొక రొమాంటిక్ క్రైమ్ కథ లాగుంది. ఈ కేసులో పోలీసుల విచారణ కూడా సవ్యంగా సాగడం లేదనే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. చివరకు ఇదెలా తేలుతుందో!

అనంతపురంలో వీళ్లు ఔట్?... కర్నూలులోనూ అదే కథ!

రెండు భారీ డిజాస్టర్లలో ఒకటైన ఎన్టీఆర్‌ కథానాయకుడు