cloudfront

Advertisement


Home > Politics - Political News

నామినేషన్ వేసిన జేసీ దివాకర్ రెడ్డి, ఏంటి కథ?

నామినేషన్ వేసిన జేసీ దివాకర్ రెడ్డి, ఏంటి కథ?

అసలే తనయుడిని బరిలోకి దించారు ఈసారి. ఒకవేళ తనే బరిలోకి దిగి ఉంటే.. ఎలాగూ రిటైర్మెంట్ సమయంలో ఓడిపోయి ఉంటే అంతటితో ఖేల్ ఖతం అయ్యేది. అయితే ఇప్పటికే చాలా వయసు వచ్చేసింది తనయుడికి. ఇలాంటి వయసులో జేసీ పవన్ తొలిసారి ఎన్నికల్లో పోటీచేస్తూ ఉన్నారు. ఇక ఈసారి కూడా పోటీచేయకపోతే.. మరో ఐదేళ్ల వరకూ తండ్రిచాటు కొడుకుగానే మిగిలిపోయినట్టుగా అవుతుంది.

ఇలాంటి నేపథ్యంలో తప్పనిసరిగా అనంతపురం నుంచి ఎంపీగా తనయుడిని పోటీ చేయించారు జేసీ దివాకర్ రెడ్డి. అయితే అనూహ్యంగా నామినేషన్ల చివరిరోజున జేసీ దివాకర్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. బహుశా వెనక్కు తీసుకుంటారేమో! అది కూడా వెళ్లి చివరిరోజున నామినేషన్ దాఖలు చేయడం వెనుక రహస్యం ఏమిటనేది ఇంకా తెలియడంలేదు.

ఆ సంగతలా ఉంటే.. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న తనయుడు కోసం దివాకర్ రెడ్డి చాలాపాట్లే పడుతున్న వైనం స్పష్టం అవుతోంది. అసలే అనంతపురం ఎంపీ సీటు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో దివాకర్ రెడ్డి చాలా పేచీలు పెట్టుకున్నారు.

ప్రభాకర్ చౌదరి, జితేంద్రగౌడ్ లకు టికెట్లు దక్కనీయకూడదని చూశారు. అయితే వారిని జేసీ అడ్డుకోలేకపోయారు. ఇలాంటి నేఫథ్యంలో దివాకర్ రెడ్డి తనయుడి విజయానికి వారు సహకరిస్తారా? అనేది ప్రశ్నార్థకమే. ఆ సంగతలా ఉంటే.. గుంతకల్ లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన మధుసూదన్ గుప్తాతో జేసీ చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. 

ఆయనను ఇటీవల తెలుగుదేశంలోకి తీసుకొచ్చారు జేసీ. అయితే టీడీపీ టికెట్ దక్కలేదు. దీంతో ఆయన వెంటనే జనసేనలోకి చేరిపోయి టికెట్ తెచ్చేసుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో జనసేన ఓట్ల బేరం గురించి జేసీ దివాకర్ రెడ్డి వెళ్లి మధుసూదన్ తో సమావేశం అయి ఉండవచ్చవనే వార్తలు వస్తున్నాయి.

మరోవైపు కాంగ్రెస్ నేత శైలజనాథ్ తో కూడా జేసీ సంప్రదింపులు జరుతున్నారట! శింగనమలలో సహకారం కోరుతున్నట్టుగా ఉన్నారు. గత ఎన్నికలప్పుడు శైలజనాథ్ ను జేసీ పవన్ మామూలుగా అవమనించాలేదు. తెలుగుదేశం పార్టీ బీఫారం శైలజనాథ్ కు దక్కగా... ఆయనపై దాడి చేసినంత పనిచేసి, ఆయన చేతుల్లోంచి టీడీపీ బీఫారం లాగేసుకుని దాన్ని చించేశారు జేసీ పవన్.

శైలజానాథ్ కు టీడీపీ టికెట్ దక్కనీయకుండా ఉండటానికి అలా వ్యవహరించారు. తీరా ఇప్పుడు అదే శైలజనాథ్ ను ‘శైలూ..’ అని బుజ్జగిస్తున్నారట దివాకర్ రెడ్డి! ఈ రాజకీయ వృద్ధుడు ఇప్పుడు చాలాపాట్లే పడుతున్నారని స్థానికులు అనుకుంటున్నారు!

సీట్ల కేటాయింపులో జగన్‌ నేర్పరితనం!