cloudfront

Advertisement


Home > Politics - Political News

రెడ్డిగారి బాధ.. ఓటుకు రెండువేలు ఇవ్వాల్సి వచ్చిందట!

రెడ్డిగారి బాధ.. ఓటుకు రెండువేలు ఇవ్వాల్సి వచ్చిందట!

జనాలు మరీ కమర్షియల్ అయిపోయారని వాపోతున్నారు జేసీ దివాకర్ రెడ్డి. ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో అప్పుడే జమాఖర్చుల వివరాలను చెబుతున్నారు దివాకర్ రెడ్డి. ఈ ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి పోటీ చేయకపోయినా ఆయన తనయుడు ఎంపీగా పోటీచేశారు. ఆయన తమ్ముడు కొడుకు తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేశారు. ఈ నేపథ్యంలో భారీగా ఖర్చుపెట్టాల్సి వచ్చిందని జేసీ ప్రకటించారు.

తాము మొత్తం యాభైకోట్ల రూపాయలకు పైనే ఖర్చు చేసినట్టుగా జేసీ ఓపెన్ గా ప్రకటించారు. ఓటుకు రెండువేల రూపాయల చొప్పున పంచినట్టుగా ఆయన తెలిపారు. కొందరు ఓటర్లు అయితే ఓటుకు నాలుగు, ఐదువేల రూపాయలు అడిగారని, అయితే తాము ఓటుకు రెండువేల రూపాయల చొప్పున పంచినట్టుగా జేసీ చెప్పారు. జనాలు కమర్షియల్ గా మారిపోయి ఓటుకు మరీ అన్యాయంగా రేటు పెంచేశారని జేసీ వాపోయారు.

చివరకు ఓటు రేటు రెండువేల రూపాయలకు తెంచినట్టుగా చెప్పారు. తామేకాకుండా అందరూ డబ్బులు పంచారని, ఓవరాల్ గా ఈ ఎన్నికల్లో రాజకీయ నేతలు పదివేల కోట్ల రూపాయలకు పైగా డబ్బులు ఖర్చు పెట్టారని జేసీ అన్నారు. రాజకీయాలు అలా కాస్ట్లీ అయిపోయాయని వాపోయారు. ఇలా పంచిన డబ్బు అంతా అవినీతి సొమ్మే అని కూడా దివాకర్ రెడ్డి తేల్చేశారు.

మరి తాము పెట్టిన ఖర్చు గురించి దివాకర్ రెడ్డి ఇలా ఓపెన్ గా చెప్పేశారు. ఈ వ్యాఖ్యలు ఈసీ నియమనిబంధలకు వ్యతిరేకం. ఈమాట ద్వారా జేసీ దివాకర్ రెడ్డి ఇంట్లో వాళ్లు పోటీచేసిన నియోజకవర్గాల ఎన్నికను  రద్దు చేయవచ్చు కూడా. అయితే అలాంటి చర్యలు ఎవరూ తీసుకోలేరనేది వీరి ధీమా.

గత ఎన్నికల్లో తను భారీగా ఖర్చుపెట్టి గెలిచినట్టుగా ప్రకటించుకున్న కోడెల మీద ఏం చర్యలు తీసుకున్నారు? అదే ధీమాతో జేసీ కూడా పెట్టిన ఖర్చు గురించి ఓపెన్ గా చెప్పినట్టున్నారు!

తెలుగుదేశంలోనూ విజయం మీద ఫుల్ కాన్ఫిడెన్స్!

నాని ఇంటర్వ్యూలో చెప్పినట్లు జెర్సీ సినిమా ఉందా?