cloudfront

Advertisement


Home > Politics - Political News

జేడీ లక్ష్మినారాయణ 'పిరికి' అధికారి అట.!

జేడీ లక్ష్మినారాయణ 'పిరికి' అధికారి అట.!

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ, స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, రాజకీయాల్లోకి వచ్చిన విషయం విదితమే. ఇప్పుడాయన జనసేన పార్టీ నుంచి విశాఖ లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. అసలాయన స్వచ్ఛంద పదవీ విరమణ చేసిందే భారతీయ జనతా పార్టీ కోసమంటూ అప్పట్లో పెద్దయెత్తున ప్రచారం జరిగింది. బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా ఆయన్ని నిలబెట్టే ఉద్దేశ్యంతో మోడీ - అమిత్‌ షా, లక్ష్మినారాయణతో మంతనాలు జరిగాయంటూ గుసగుసలు విన్పించాయి.

కానీ, ఇప్పుడు అదే బీజేపీ, లక్ష్మినారాయణను 'పిరికి' అధికారి అంటూ అభివర్ణిస్తోంది. బీజేపీనేత రఘురామ్‌, ఈ విషయమై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీలో చేరాలో తెలియక గందరగోళంలో వున్న లక్ష్మినారాయణను అసలు 'పోటీ అభ్యర్థిగానే' తాము చూడటంలేదని తేల్చిపారేశారు. అంతేనా, కాంగ్రెస్‌ హయాంలో జగన్‌ మీద పెట్టిన కేసుల విషయంలో లక్ష్మినారాయణ ఒరగబెట్టిందేమీ లేదనీ, అత్యుత్సాహం మాత్రం చూపారనీ విమర్శించారు రఘురామ్‌.

ఈ 'అత్యుత్సాహం' విషయమై లక్ష్మినారాయణ మీద ఆరోపణలున్న మాటవాస్తవం. అయితే, ఇదే బీజేపీ గతంలో లక్ష్మీనారాయణ చేరికతో తమ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో బలోపేమతమవుతుందని చెప్పుకుంది. కర్నూలు నుంచి ఆయన పోటీచేసే అవకాశాలున్నాయనీ చెప్పుకున్నారు బీజేపీ నేతలు. చివరికి, కన్నా లక్ష్మినారాయణతో బీజేపీ సరిపెట్టుకోవాల్సి వచ్చిందనుకోండి.. అది వేరేసంగతి.

ఒక్కటి మాత్రం నిజం.. రాజకీయాలపై ఆసక్తి ఏర్పడ్డాక జనసేన గురించి ఆలోచించానని చెప్పుకున్న వీవీ లక్ష్మినారాయణ, చాలా పార్టీల చుట్టూ తిరిగారు. అందులో లోక్‌సత్తా కూడా వుంది. చివరికి ఆయన జనసేన గూటికే చేరాల్సి వచ్చింది. విశాఖజిల్లా నుంచే అసెంబ్లీకి లక్ష్మినారాయణతో పోటీచేయించాలని టీడీపీ చాలా ప్రయత్నాలు చేసి, చివరికి ఆయన్ని జనసేనకు అంటగట్టిందన్నదీ ఓపెన్‌ సీక్రెట్‌.

రాజకీయాలంటే ఇలాగే వుంటాయ్‌.! ఒకప్పుడు వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసుని డీల్‌ చేస్తున్నప్పుడు, లక్ష్మినారాయణకి బోల్డంతమంది ఫ్యాన్స్‌ పుట్టుకొచ్చారు. వాళ్ళంతా 'పెయిడ్‌' బ్యాచ్‌ అనీ, టీడీపీతోపాటు కాంగ్రెస్‌ వేయించిన ఫ్లెక్సీల్ని చూసి లక్ష్మినారాయణ తనను తాను ఎక్కువ ఊహించుకున్నారనీ ఇప్పుడు ఇంకాస్త స్పష్టంగా తేలిపోయిందంతే.

రాధాకృష్ణ నాతో పెట్టుకోకు నేను ఎదవని కాదు...

సురేఖ వద్ద పవన్ పర్సనల్ లోన్.. కోటి ఏడు లక్షలకు పైగా..