cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

బీజేపీకి స్ట్రాంగ్ వార్నింగ్.. ముందుంది ముసళ్ల పండగ

బీజేపీకి స్ట్రాంగ్ వార్నింగ్.. ముందుంది ముసళ్ల పండగ

దేశవ్యాప్తంగా బీజేపీ తన బలాన్ని, బలగాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంలో ఉంది. ఉత్తరాదిలో ఒక్కో రాష్ట్రాన్నే గుప్పెటపడుతూ వస్తోంది. ముందు సంకీర్ణం అంటారు, ఆ తర్వాత మొత్తంగా తమదే బలం అని నిరూపించుకుంటారు. 

ఇలాంటి రాజకీయాలతోనే బీహార్ ని దాదాపుగా బీజేపీ హస్తగతం చేసుకుంది. పేరుకి నితీష్ కుమార్ సీఎం అయినా.. కూటమిలో అతి పెద్ద పార్టీగా మారిన బీజేపీదే అక్కడ పెత్తనం అంతా. మహా ఘట్ బంధన్ నుంచి విడిపోయి, ఎన్డీఏతో చేరి బీహార్ లో తన సొంత బలాన్ని కోల్పోయారు నితీష్ కుమార్.

కట్ చేస్తే.. మిత్రపక్షం అనే కనికరం కూడా లేకుండా అసోంలో జేడీయూని బలహీనపరిచే కుట్ర చేసింది బీజేపీ. ఇటీవలే అక్కడ ఆరుగురు ఎమ్మెల్యేలు జేడీయూ నుంచి బీజేపీలోకి ఫిరాయించారు. ఆ దెబ్బతో జేడీయూకి ఓ రేంజ్ లో జ్ఞానోదయం అయింది. ముల్లుని ముల్లుతోనే తీయాలనే ఉద్దేశంతో ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు జేడీయూ నేతలు. 

బీహార్ వరకే మన స్నేహం, బోర్డర్ దాటితే నువ్వెవరో నేనెవరో అంటున్నారు. 2022లో ఉత్తర ప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఒంటరిగా బరిలో దిగుతుందని ప్రకటించి తాజాగా బాంబు పేల్చారు జేడీయూ నేతలు.

ఉత్తరప్రదేశ్ లో జేడీయూకి పెద్దగా బలం లేదు. ఒకటీ రెండు సీట్లు మినహా ఎప్పుడూ పూర్తి స్థాయిలో సత్తా చూపింది లేదు. కానీ ఇతర పార్టీల విజయావకాశాలను ప్రభావితం చేసే స్థాయిలో అక్కడ జేడీయూకి ఓటు బ్యాంకు ఉంది. అందుకే ఎన్డీఏలో చేర్చేసుకుని గత రెండు దఫాలుగా ఆ రెండు మూడు సీట్లలో కూడా జేడీయూని పోటీ చేయకుండా నిలిపివేసింది బీజేపీ. 

తీరా ఇప్పుడు ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న టైమ్ లో జేడీయూ పెద్ద షాకిచ్చింది. బీహార్ లో భాయీ భాయీ.. యూపీలో మాత్రం నువ్వా-నేనా అంటోంది.

యూపీలో బీజేపీకి గడ్డుకాలమే..

లవ్ జీహాదీ సహా.. యూపీలో పలు సంచలనాత్మక, విమర్శనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. యోగి పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే మాట వాస్తవం. ఈ వ్యతిరేకతను ఓట్ల రూపంలో మార్చుకోడానికి ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ ఏమేరకు సఫలం అవుతున్నాయనే విషయాన్ని పక్కనపెడితే.. సందడ్లో సడేమియాలాగా జేడీయూ దూరం కావడం మరింత ఇబ్బంది పెట్టే పరిణామం.

అసోంలో తమకు చేసిన ద్రోహానికి యూపీలో బదులు తీర్చుకుంటామంటూ జేడీయూ చేస్తున్న హెచ్చరికలతో బీజేపీ ఎంతమేరకు అలర్ట్ అవుతుందో చూడాలి. 

థియేటర్లకు ఇంకా కష్టం

జ‌గ‌న్ పార్టీ ఉనికిని కాపాడింది ష‌ర్మిలే

 


×