cloudfront

Advertisement


Home > Politics - Political News

లోకేష్ పై ఎంక్వయిరీ చేశాను.. అది నిజమే!

లోకేష్ పై ఎంక్వయిరీ చేశాను.. అది నిజమే!

ఏపీ రాజకీయాల్లో సీజనల్ కామెడీ చేస్తున్న కేఏ పాల్, ఈసారి లోకేష్ ను టార్గెట్ చేశారు. చంద్రబాబుది కుటుంబ పార్టీ అంటూ విమర్శించిన పాల్, మాటలురాని లోకేష్ కు 3 మంత్రి పదవులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

చంద్రబాబుది కుటుంబ పార్టీ. మాటలు రాని లోకేష్ కు 3 మంత్రి పదవులు ఇచ్చాడాయన. లోకేష్ పంచాయతీ సెక్రటరీగా కూడా గెలవరని గతంలో పవన్ అన్నారు. నాకు డౌటొచ్చి ఎంక్వయిరీ చేశాను. అది కరెక్ట్. ఆయన వీడియో ఒకటి చూశాను.

కులపిచ్చి, మత పిచ్చి, అవినీతి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని స్వయంగా లోకేషే చెప్పాడు. ఆ వీడియో చూసి నేను ఆశ్చర్యపోయాను. అంటే ఏంటి, లోకేష్ కు మాటలు రావనే కదా అర్థం. బైబిల్ లో చెప్పిన ప్రకారం... లోకేష్ మనసులో ఉన్నదే అప్పట్లో మాట రూపంలో బయటకు వచ్చిందంటున్నారు పాల్.

రాబోయే ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే, చంద్రబాబు మరోసారి రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. హృదయంలో ఏదైతే నిండి ఉంటుందో అదే నోరు మాట్లాడుతుందని బైబిల్ లో ఉంది. లోకేష్ హృదయంలో ఏది ఉందో అదేమాట రూపంలో బయటకు వచ్చింది. ఈ విషయంలో లోకేష్ అన్నీ నిజాలే చెప్పాడు. మంచివాడు అతడు.

గతంలో బాలకృష్ణ ఎవరో తెలియదన్నానని, కానీ స్టడీ చేసి ఇప్పుడు తెలుసుకున్నానని పాల్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ వందశాతం అధికారంలోకి వస్తుందంటూ కామెడీ చేశారు.

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

ఎన్టీఆర్ బయోపిక్ః ఒకవైపే చూడు..!