Advertisement

Advertisement


Home > Politics - Political News

సీబీఐ క‌స్ట‌డీకి క‌డ‌ప ఎంపీ స‌న్నిహితుడు!

సీబీఐ క‌స్ట‌డీకి క‌డ‌ప ఎంపీ స‌న్నిహితుడు!

క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అత్యంత స‌న్నిహితుడు దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డిని పులివెందుల కోర్టు సీబీఐ క‌స్ట‌డీకి అనుమ‌తించింది. వివేకా హ‌త్య కేసులో వైసీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డి పేరును నిందితుడు ద‌స్త‌గిరి చెప్పిన సంగ‌తి తెలిసిందే. 

శివ‌శంక‌ర్‌రెడ్డితో పాటు వైఎస్ కుటుంబ స‌భ్యుల పేర్ల‌ను కూడా ద‌స్త‌గిరి ప్ర‌స్తావించిన సంగ‌తి తెలిసిందే. వివేకా కూతురు డాక్ట‌ర్ సునీత కూడా హైకోర్టుకు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో దేవిరెడ్డి పేరుంది.

ఈ నేప‌థ్యంలో  వివేకా హత్య కేసులో అరెస్టు అయి క‌డ‌ప కేంద్ర కారాగారంలో ఉన్న‌ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని 8 రోజులు కస్టడీకి ఇవ్వాలని పులివెందుల కోర్టులో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. 7 రోజుల కస్టడీకి అనుమతించింది. కోర్టు ఆదేశాల మేరకు డిసెంబరు 2వ తేదీ వరకు శివశంకర్‌రెడ్డిని సీబీఐ   ప్రశ్నించనుంది.  

"ఈ హత్య చేస్తే శంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారు. అందులో రూ.5 కోట్లు నీకు ఇస్తాను" అంటూ వివేకాకు సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి నేర అంగీకార వాంగ్మూలంలో వెల్లడించ‌డం తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తించింది. 

త‌న తండ్రి హ‌త్య కేసులో దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డి పాత్ర‌పై డాక్ట‌ర్ సునీత ఇప్ప‌టికే సీబీఐకి కొన్ని ఆధారాలు స‌మ‌ర్పించింది. అలాగే నిందితుడు ద‌స్త‌గిరి, డాక్ట‌ర్ సునీత చెప్పిన అంశాల ఆధారంగా దేవిరెడ్డి నుంచి ఏ విధ‌మైన నిజాలు రాబ‌డుతారో అనే ఉత్కంఠ నెల‌కుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?