Advertisement

Advertisement


Home > Politics - Political News

కర్ణాటక: కాంగ్రెస్ ఆశలు వదిలేసినట్టేనా!

కర్ణాటక: కాంగ్రెస్ ఆశలు వదిలేసినట్టేనా!

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం నిలబడే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. ఇక ఇంతకంటే చేసేది కూడా ఏమీ లేదన్నట్టుగా కాంగ్రెస్ వాళ్లు కూడా కామ్ అయిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అసలు లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిన కాంగ్రెస్ పార్టీ ఇక కర్ణాటకలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసే అవకాశాలు కనిపించడం లేదు. జరిగేది జరగక మానదన్నట్టుగా విశ్వాస పరీక్షకు కూడా కాంగ్రెస్ రెడీ అయిపోతూ ఉండటం గమనార్హం.

కుమారస్వామి పరిస్థితి కూడా దాదాపు అంతేనని, ఏదో జాక్ పాట్ గా కలిసి వచ్చిన ముఖ్యమంత్రి పీఠంలో ఏడాది పాటు కొనసాగినందుకు ఆయన ఆనందంగా ఉన్నారని, ఇక పదవి నుంచి దిగిపోవడానికి కూడా ఆయన రెడీనే అని ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్యేల పట్టు నిలుపుకునేందుకు, అసంతృప్తులను అదిలించేందుకు పెద్దగా ప్రయత్నాలు జరగడంలేదు. ఒక్క రోషన్ బేగ్ ను మాత్రం అధికారాన్ని ఉపయోగించి అదుపులోకి తీసుకున్నట్టుగా ఉన్నారు. రాజీనామా అంటూ అసంతృప్తుడిగా ఉన్న ఆ ఎమ్మెల్యేను ఒక కేసులో కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇక మిగతావాళ్లు మాత్రం కుమారస్వామికి దొరికేలా లేరు. గురువారం విశ్వాస పరీక్షతో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమనే అంచనాలు ఏర్పాడ్డాయి. ప్రతిపక్షంలో కూర్చోవడానికి రెడీగా ఉండాలని సిద్ధరామయ్య తనవర్గం ఎమ్మెల్యేలతో వ్యాఖ్యానించినట్టుగా కూడా వార్తలు వస్తుండటం గమనార్హం.

పరిటాల సునీతకు కోరుకున్నది దక్కింది.. ఉంటారా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?