cloudfront

Advertisement


Home > Politics - Political News

కేసిఆర్ పవిత్రుడా? అపవిత్రుడా?

కేసిఆర్ పవిత్రుడా? అపవిత్రుడా?

కేసిఆర్ అనే వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు కు టార్గెట్. రకరకాల విమర్శలు గత కొద్ది రోజులుగా చేస్తున్నారు. ఆయన పాలన వేస్ట్ అని, సాధించింది ఏదీ లేదని, అంచనాలు పెంచి అవినీతికి పాల్పడ్డారని ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. బాగానే వుంది. అంతా ఓకె.

కానీ ఇక్కడ ఒకటే అనుమానం. కేసిఆర్ ను ముందుగా ఫ్రెండ్ షిప్ చేద్దాం రమ్మని పిలిచింది చంద్రబాబే. కానీ కేసిఆర్ కాదు పొమ్మన్నారు. ఇదే కేసిఆర్ ఘోర తప్పిదమని, చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని వుంటే అద్భుతంగా వుండేదని, ప్రముఖ 'సర్వేయర్' లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఇదే ముక్క పదేపదే తెలుగుదేశం అను'కుల' మీడియా చెబుతోంది.

ఒకవేళ కేసిఆర్ కనుక బాబు గారితో ఫ్రెండ్ షిప్ కు ఓకె అని వుంటే..? అప్పుడు కేసిఆర్ పవిత్రుడు అయిపోయి వుండేవారా? ఈ విమర్శలు అన్నీ గొయ్యి తీసి పూడ్చి పెట్టి వుండేవారా? అలాగే ఇప్పుడు సోనియా, రాహుల్ భజన చేస్తున్న బాబుగారు, అప్పుడు వాళ్లను చీల్చి చెండాడి వుండేవారా?

అంటే మనతో కలిసి నడవడానికి ఒప్పకుంటే పవిత్రులు. మన మాట వినకుంటే అపవిత్రులు, బాబుగారికి, ఆయన భజన మీడియాకు ఇదేనా సింగిల్ పడికట్టు సూత్రం?