cloudfront

Advertisement


Home > Politics - Political News

పవన్ కు బాబు నుంచి రూ.వెయ్యి కోట్లు!

పవన్ కు బాబు నుంచి రూ.వెయ్యి కోట్లు!

జనసేన అధిపతి పవన్ కల్యాణ్ కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వెయ్యి కోట్ల రూపాయలతో భారీ ప్యాకేజ్ ను ఇచ్చారని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఏపీలో జనసేన పోటీ విషయంలో చంద్రబాబు నాయుడు – పవన్ కల్యాణ్ ల మధ్యన డీల్ ఇదేనని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కేతిరెడ్డి ఈ ఆరోపణ చేశారు. 

ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకతను పవన్ కల్యాణ్ ను  ఉపయోగించుకుని డైల్యూట్ చేయడానికి బాబు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారని కేతిరెడ్డి అన్నారు. అందుకే జనసేన పోటీ చేస్తోందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి చంద్రబాబు నాయుడుకు సాయపడటమే పవన్ కల్యాణ్ ఉద్దేశం అని వెంకట్రామిరెడ్డి ఆరోపించారు.

ఇందుకు గానూ చంద్రబాబు నాయుడు నుంచి పవన్ కు భారీ ప్యాకేజీ దక్కుతోందని, దాని విలువ వెయ్యి కోట్ల రూపాయలని ఈ మాజీ ఎమ్మెల్యే అన్నారు. ఈ డీల్ లో లింగమనేని మధ్యవర్తిగా వ్యవహరించారని.. ఇలా జనసేనను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాలనే ప్రణాళికను బాబు అమలు చేస్తూ ఉన్నారని అన్నారు,

సీమ సింహం ఎవరు? ఫిరాయింపుల ప్రభావం ఎంత?

సీక్రెట్ గా లెటర్ రాస్తే.. ఆంధ్రజ్యోతికి ఎలా వచ్చింది.. పోసాని