Advertisement

Advertisement


Home > Politics - Political News

'కియా' క్రెడిట్ కూడా పాయే..!

'కియా' క్రెడిట్ కూడా పాయే..!

మాటెత్తితే తమ హయాంలో కియా ప్రాజెక్టు తరలి వచ్చిందని, చంద్రబాబును చూసి పెనుకొండ సమీపంలో కియా ప్లాంట్ ను హ్యుండాయ్ సంస్థ నెలకొల్పిందని తెలుగుదేశం పార్టీ వాళ్లు డప్పు వేసుకునే వారు. ఈ డప్పు వేయడం అటు చంద్రబాబు నాయుడు నుంచి మొదలై తెలుగుదేశం పార్టీ వీరాభిమానుల వరకూ వెళ్లేది. అలా డప్పు వేసుకోవడం, కియాలో ఇంకా కార్ల ఉత్పత్తి ప్రారంభం కాకముందే ఎన్నికల ముందు చాలా హడావుడి చేయడం జరిగింది.

అయితే కియా ఘనత చంద్రబాబుది అని అక్కడి స్థానికులు కూడా ఒప్పుకోలేదు. కియా పరిశ్రమ ఆ ప్రాంతంలో ఏర్పడటం వల్ల ఆ చుట్టుపక్కల అంతా రేట్లు పెరిగాయి. పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం.. ఈ మూడు నియోజకవర్గాల పరిధిలోనూ కొంత పరిధిమేర భూముల ధరలు అనేక రెట్లు పెరిగాయి. లక్షలు కూడా పలకని భూములు కోట్ల రూపాయల రేంజ్ కు చేరాయి. 

అయితే ప్రజలు మాత్రం ఈ విషయంలో చంద్రబాబు నాయుడును అసలు గుర్తించలేదు. అందుకు నిదర్శనం పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం.. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం చిత్తు కావడం. పెనుకొండ అయితే టీడీపీకి కంచుకోట, పుట్టపర్తిలోనూ టీడీపీకి ఎదురుండేది కాదు. అయితే పెనుకొండ కోట టీడీపీకి బద్ధలు కావడంతో పాటు, పుట్టపర్తి చరిత్రలోనూ ఎన్నడూ లేనంత స్థాయిలో ముప్పై వేలకు పైగా మెజారిటీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.

కియా పేరుతో రాష్ట్రమంతా గెలవాలని చంద్రబాబు అనుకుంటే, ఆ చుట్టుపక్కల కూడా చిత్తు అయిపోయింది టీడీపీ. అదీ చంద్రబాబుకు ప్రజలు ఇచ్చిన క్రెడిట్. అయినా టీడీపీ తగ్గేరకం కాదు. ఏదోలా డప్పు వేసుకునే రకమే. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకపోయింది.

వైఎస్ గతంలో చేసిన విన్నపం మేరకే తాము ఏపీలో కియా తొలి ప్లాంట్ ను నెలకొల్పినట్టుగా హ్యుండాయ్ చైర్మన్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాయడం తెలుగుదేశం పార్టీకి మింగుడు పడే అంశంకాదు. తమ హయాంలో జరిగిన అద్భుతంగా కియాను ప్రస్తావించే వాళ్లకు ఇక నుంచి హ్యుండాయ్ చైర్మన్ లేఖ రివర్స్ పంచ్ గా మారనుంది.

పరిటాల సునీతకు కోరుకున్నది దక్కింది.. ఉంటారా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?