cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

సినిమా చూసి మరీ కిడ్నాప్ ప్రాక్టీస్ చేశారు

సినిమా చూసి మరీ కిడ్నాప్ ప్రాక్టీస్ చేశారు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్ పల్లి కిడ్నాప్ వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. కిడ్నాపర్లు, ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ వ్యక్తుల్లా తయారై, ఐడీ కార్డులు ధరించి మరీ ఇంట్లోకి చొరబడి కిడ్నాప్ కు యత్నించారు. దీనికి సంబంధించి ఓ స్కూల్ లో వాళ్లు ప్రాక్టీస్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడీ కిడ్నాప్ కు సంబంధించి మరో కొత్త కోణం బయటపడింది.

హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ఓ సినిమా చూసి మరీ కిడ్నాప్ ఎలా చేయాలో ప్రాక్టీస్ చేశారట. స్పెషల్ ఛబ్బీస్ అనే సినిమాలో అక్షయ్ కుమార్ అతడి గ్యాంగ్ ఐటీ అధికారుల్లా వచ్చి దోచుకుంటారు. ఆ సన్నివేశాలు చూసే ఐటీ ఆఫీసర్లలా ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నారట కిడ్నాపర్లు. ఆ సినిమా చూసే రిహార్సల్స్ చేసినట్టు పోలీసుల విచారణలో బయపడింది.

భార్గవ్ సోదరుడు, అఖిలప్రియ మరిది చంద్రహాస్ ఈ రిహార్సల్స్ కార్యక్రమాలన్ని చూసుకున్నాడట. యూసఫ్ గూడలోని తనకు చెందిన ఓ ఇంటర్నేషనల్ స్కూల్ లో కిడ్నాపర్లకు క్లాసులు తీసుకున్నాడట. శ్రీనగర్ కాలనీలోని ఓ సినిమా కంపెనీ నుంచి డ్రెస్సులు తెప్పించడం, ఓ కన్సల్టెన్సీ కంపెనీ నుంచి నకిలీ ఐడీ కార్డులు తయారుచేయించడం లాంటి పనులన్నీ ఇతడే చూసుకున్నాడు.

రెండో రోజు పోలీస్ కస్టడీలో భాగంగా అఖిలప్రియ ఈ విషయాల్ని బయటపెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు కాల్ డేటాకు సంబంధించి మాత్రం ఆమె మౌనం వహించారు.. తను పెద్ద రాజకీయ నేతనని, చాలామంది ఫోన్లు చేస్తుంటారని తప్పించుకునే ప్రయత్నం చేశారట. పోలీసులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆమె మౌనంగానే ఉండిపోయారట.

ఇక ఈ కేసులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. పరారీలో ఉన్న అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారట. ఓ రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేస్తున్నారట. కాకపోతే ఆ విషయాన్ని పోలీసులు బయటకు వెళ్లడించడం లేదని టాక్. భార్గవ్ రామ్ ను అరెస్ట్ చేశామనే విషయం బయటకు పొక్కిన అఖిలప్రియతో పాటు ఆల్రెడీ అరెస్టైన మిగతా వ్యక్తులంతా మరింత జాగ్రత్తపడతారనే ఉద్దేశంతో పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది 

గవర్నర్‌ దత్తాత్రేయను కలిసిన సీఎం జగన్

ఈ సంక్రాంతి అల్లుడు నేనే

 


×