Advertisement

Advertisement


Home > Politics - Political News

బాబు అనుకున్నంతా అయింది.. కొడాలి ఊచకోత

బాబు అనుకున్నంతా అయింది.. కొడాలి ఊచకోత

ఎన్టీఆర్ జయంతి, వర్థంతి రోజుల్లో.. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించే క్రమంలో చంద్రబాబుని తెలియని భయం వెంటాడుతుంటుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ వర్థంతి అంటేనే బాబుకి వణుకు. 

పొరపాటున ఎవరైనా ఆయన చావుకి తనే కారణం అని అంటారేమోనని, ఆయన్ని పదవిలోనుంచి తొలగించి, ఆయనపై చెప్పులు వేయించి, అవమాన భారంతో చనిపోయేలా చేసింది తానేననే చర్చ మళ్లీ మొదలవుతుందేమోనని బాబు భయం.

ఆ భయమే మంత్రి కొడాలి నాని రూపంలో నిజమైంది. ఈ ఏడాది ఎన్టీఆర్ వర్థంతి సాకుతో చంద్రబాబుకి చాకిరేవు పెట్టారు మంత్రి నాని. ముక్క చీవాట్లు పెట్టారు. 

ఎన్టీఆర్ కి నివాళులర్పిస్తున్నానంటూ ప్రెస్ మీట్ పెట్టిన నాని, ఫుల్లుగా చంద్రబాబుపై ఎక్కి దిగారు. ఇలాంటి నీఛుడు, నికృష్టుడి గురించి మాట్లాడుకోవడమే తప్పు అంటూనే పదే పదే బాబుని రాజకీయ వ్యభిచారి అంటూ తీవ్రంగా విమర్శించారు.

బాబు బతికున్నంత వరకు ఎన్టీఆర్ కి భారత రత్న రాదు..

ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ నాయకులు ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఎన్టీఆర్ వర్థంతి రోజున ఆయనకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

అయితే ఎన్టీఆర్ జయంతి, వర్థంతి, లేదా మహానాడు రోజే చంద్రబాబుకి ఈ భారత రత్న డిమాండ్ గుర్తొస్తుందని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేంద్రంలో ఆయన అనుకూల పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు భారత రత్న విషయం గుర్తు రాదా అని ప్రశ్నించారు నాని. 

ఫలానా వారిని రాష్ట్రపతిని చేశాను, ఫలానా వారికి నా ప్రధాని పదవి త్యాగం చేశానని చెప్పుకునే బాబు.. ఎన్టీఆర్ కి భారత రత్న రాకుండా అడ్డు పడుతున్నారని అన్నారు. నాలుగు ఓట్లు వస్తాయనుకుంటే.. మొహంపై ఉమ్మేయించుకోడానికి కూడా చంద్రబాబు మొహమాట పడరని అన్నారు నాని. సింపతీతో ఓట్లు పడతాయనుకుంటే మొహం ముందుకి పెట్టి మరీ ఉమ్ము వేయించుకుంటారని అన్నారు.

ఆయన వ్యవస్థాపకుడు.. వీరు భూస్థాపకులు..

ఎన్టీఆర్, టీడీపీ వ్యవస్థాపకులు అయితే.. చంద్రబాబు, లోకేష్ ఆ పార్టీని భూస్థాపితం చేసే వరకు నిద్రపోరని, వీరి హయాంలోనే పార్టీ భూస్థాపితం అవుతుందని జోస్యం చెప్పారు నాని. 

టీడీపీని నాశనం చేసే శక్తి ఇద్దరిలోనే ఉందని, బాబు, చినబాబు.. ఆ పార్టీని తొక్కేసి, సర్వనాశనం చేస్తారని మండిపడ్డారు. ఎన్టీఆర్ చావుకి కారణం అయిన చంద్రబాబుకి కనీసం ఆయన పేరు ఉచ్ఛరించే అర్హత కూడా లేదని అన్నారు నాని. 

అఖిల ప్రియ అరెస్ట్ పై మాట్లాడలేని నిస్సహాయుడు బాబు అని అన్నారు. అదే అరెస్ట్ ఏపీలో జరిగితే ప్రభుత్వంపై విమర్శలు చేసేవారని, తెలంగాణలో జరగడం వల్లే కిక్కురుమనకుండా ఉన్నారని అన్నారు. చంద్రబాబుని రాష్ట్ర సరిహద్దులు దాటే వరకు తరిమి కొట్టాలన్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?