cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ఎన్టీఆర్ తో సంబంధాల‌పై కొడాలి నాని

ఎన్టీఆర్ తో సంబంధాల‌పై కొడాలి నాని

తెలుగుదేశం అధినేత, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. త‌న రాజ‌కీయ అవ‌స‌రాల కోసం చంద్ర‌బాబు నాయుడు త‌న భార్య‌ను రోడ్డ మీద‌కు తీసుకు వ‌చ్చార‌ని కొడాలి నాని అన్నారు. ఈ విష‌యంలో చంద్ర‌బాబు నాయుడి తీరు రాజ‌కీయ వ్య‌భిచారంలా ఉంద‌ని వ్యాఖ్యానించారు. ఏదోలా రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌ని చంద్ర‌బాబు నాయుడు తాప‌త్ర‌ప‌య‌డుతున్నార‌ని, బుద్ధీ, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నార‌ని మంత్రి వ్యాఖ్యానించారు. 

ద‌ద్ద‌మ్మ‌లా చంద్ర‌బాబును అనుస‌రిస్తూ లోకేష్ కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని నాని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు నాయుడు, ఎల్లో మీడియా క‌లిసి ఆమెను అల్ల‌రి చేస్తున్నార‌న్నారు. ఎన్టీఆర్ కూతురును తాము ప‌ల్లెత్తు మాట అన‌లేద‌ని, అయితే రాజ‌కీయ అవ‌స‌రం కోసం చంద్ర‌బాబు నాయుడు ఇలాంటి నీఛ రాజ‌కీయం చేస్తున్నార‌న్నారు.

వ‌ర‌ద‌న‌ష్టాల‌పై త‌మ ప్ర‌భుత్వం వేగంగా స్పందించింద‌ని, చంద్ర‌బాబు నాయుడు వర‌ద బాధితుల వ‌ద్ద‌కు వెళ్లి త‌న భార్య‌ను అవ‌మానించార‌ని చెప్పుకుంటూ సానుభూతి పొందాల‌ని చూస్తున్నార‌ని అన్నారు. ఈ సొల్లు పురాణం వ‌ర‌ద బాధితుల‌కు ఎందుక‌న్నారు.

వ‌ర‌ద ప్రాంతంలో ప‌ర్య‌టిస్తే.. అక్క‌డ స‌మ‌స్య‌ల గురించి మాట్లాడాల‌ని కొడాలి నాని హిత‌వు ప‌లికారు. అక్క‌డి స‌మ‌స్య‌ల‌ను ఏ ప్రెస్ మీట్ లోనో చెబితే మంచిద‌న్నారు. అదంతా వ‌దిలి చంద్ర‌బాబు నాయుడు సొల్లు క‌బుర్లు చెబుతున్నార‌న్నారు.

త‌న‌తో పెట్టుకున్న వాళ్లు గాల్లో క‌లిసి పోతార‌ని చంద్ర‌బాబు నాయుడు వ్యాఖ్యానించార‌న్నారు. అయితే జ‌గ‌న్ తో పెట్టుకున్న వాళ్లే స‌ర్వ‌నాశ‌న‌మైపోయార‌న్నారు. కుప్పంలో ఓట‌మిని త‌ట్టుకోలేక ఏడ్చింది చంద్ర‌బాబే అని అన్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి దేవుడి ఆశీస్సులున్నాయ‌న్నారు.

ఎన్టీఆర్ తో తన సంబంధాల గురించి కూడా కొడాలి నాని వ్యాఖ్యానించారు. త‌ను, ఎన్టీఆర్ ఒక‌ప్పుడు క‌లిసున్నామ‌ని, క‌లిసి ప‌ని చేశామ‌ని.. ఆ త‌ర్వాత విడిపోయామ‌ని కొడాలి నాని అన్నారు. చంద్ర‌బాబుపై తన‌, వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్ వ్యాఖ్య‌ల వెనుక ఎన్టీఆర్ ఉన్నాడ‌నే ప్ర‌చారం ప‌ట్ల కొడాలి నాని అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అలాంటి ప్ర‌స‌క్తే లేద‌న్న‌ట్టుగా ఆయ‌న స్పందించారు.

త‌న‌కు ప్ర‌త్యేకంగా భ‌ద్ర‌తా ఏర్పాట్లు అవ‌స‌రం లేద‌ని, పెద్ద భ‌ద్ర‌తాద‌ళం వెనుక‌ ర‌క్ష‌ణ పొందుతున్న‌ది చంద్ర‌బాబు నాయుడే అని కొడాలి నాని అన్నారు.

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!