Advertisement

Advertisement


Home > Politics - Political News

కూన మీద రౌడీ షీట్?

కూన మీద రౌడీ షీట్?

తెలుగుదేశం పార్టీ క్రమ శిక్షణ కలిగిన పార్టీ అంటారు, నాలుగు దశాబ్దాల చరిత్ర అంటారు. అటువంటి పార్టీలో అధినేత నుంచి సామాన్య కార్యకర్త వరకూ మాటలు తూలడం సర్వ సాధారణమైపోయింది. అయితే కొంతమంది నాయకులు మరింత శ్రుతి మించుతున్నారు. మితిమీరుతున్నారు.

అటువంటి వారికే ఫస్ట్ మార్కులు వేసి నాటి సర్కార్ ప్రోత్సహించింది కూడా. ఎవరైతే దూకుడుగా ఉంటారో వారే పార్టీకి పెద్ద దిక్కు అన్నట్లుగా పచ్చ పార్టీ అధినాయకత్వం వారి ఆగడాలను చూసీ చూడనట్లుగా అప్పట్లోవదిలేసింది.

ఇపుడు అధికారం లేకపోయినా అటువంటి వారు వీరంగం వేస్తున్నారు. గత ఏడాదిగా శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ అధికారుల మీద దాష్టికాలు చేస్తూ ఎప్పటికపుడు మీడియాకు ఎక్కుతున్నారు.

నాడూ నేడూ కూడా అధికారులు దీన్ని ఖండిస్తూ వస్తున్నారు. కూన మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆయన్ని అరెస్ట్ చేయడం,  బెయిల్ ఇచ్చి ఇంటికి పంపేయడం షరా మామూలు  కధగా మారింది.

ఇపుడు మాత్రం జిల్లాలోని అధికారులు, ఉద్యోగ సంఘాల‌ నేతలంతా ఆయన మీద రౌడీ షీట్ తెరవమని గట్టిగా కోరుతున్నారు. మరి వైసీపీ సర్కార్ ఆ పని చేస్తుందా. కూన  మీద పోలీస్ కేసులు పెడితేనే చంద్రబాబు నుంచి అచ్చెన్నాయుడు వరకూ అంతా ఆయనకు మద్దతుగా నిలిచి వైసీపీ మీద గగ్గోలు పెట్టారు.

ఇపుడు రౌడీ షీట్ ఓపెన్ చేస్తే దీన్ని కూడా రాజకీయం చేస్తారా, సానుభూతి డ్రామాలు మొదలుపెడతారా, అసలు వైసీపీ సర్కార్ కూన విషయంలో ఏం చేయాలనుకుంటోంది. ఎలా డీల్ చేయాలనుకుంటోంది. ఇవన్నీ ప్రశ్నలే. కానీ కూన మాత్రం అధికారులకు అరవీర భయంకరుడే అయిపోయారని అంటున్నారు. మరి వైసీపీ సర్కార్  చేతిలోనే  ఆయన భవితవ్యం ఉంది. 

దేవుడి ఆస్తులను కాజేసింది చంద్రబాబు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?