cloudfront

Advertisement


Home > Politics - Political News

చంద్రబాబుకు మొహం చాటేసిన టీడీపీ నేతలు?

చంద్రబాబుకు మొహం చాటేసిన టీడీపీ నేతలు?

కర్ణాటక లో ఎన్నికల ప్రచారానికి వెళ్తూ దారి మధ్యలో కర్నూలులో పార్టీ నేతలతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఝలక్ తగిలినట్టుగా సమాచారం. కర్నూలు జిల్లా నేతలను సమీక్షకు రమ్మని బాబు పిలవగా వారిలో చాలా మంది మొహం చాటేసినట్టుగా తెలుస్తోంది.

కర్నూలు జిల్లాలో టీడీపీ తరఫున పోటీ చేసిన పలువురు అభ్యర్థులు ఈ సమీక్ష సమావేశానికి హాజరు కాలేదని సమాచారం. కీలకమైన నేతలే ఈ సమావేశానికి గైర్హాజరు కావడం ఆసక్తిదాయకంగా మారింది.

ఆళ్లగడ్డ అభ్యర్థి అఖిలప్రియ, శ్రీశైలం అభ్యర్థి బుడ్డా  రాజశేఖర రెడ్డి, పత్తికొండ అభ్యర్థి కేఈ శ్యాంబాబు..ఇంకా కేఈ ప్రతాప్, మీనాక్షి నాయుడు, తిక్కారెడ్డి.. వీళ్లంతా సమావేశానికి గైర్హాజరు అయినట్టుగానే తెలుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడే కర్నూలు వరకూ వచ్చి సమీక్షకు రావాలని తమ వారికి చెప్పినా వారిలో ఇలాంటి ముఖ్యమైన వాళ్లంతా హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది!