cloudfront

Advertisement


Home > Politics - Political News

లగడపాటి జోస్యమే నిజమవుతోందా?

లగడపాటి జోస్యమే నిజమవుతోందా?

జాతీయ మీడియా అంతా ఒకవైపు, లగడపాటి రాజ్ గోపాల్ మరో వైపు. లగడపాటి జోస్యం ప్రకారం మహాకూటమి పవర్ లోకి రాబోతోంది. మరి జాతీయ మీడియా ఎందుకలా? ఆ సంగతి ఏమో కానీ, లగడపాటి తన క్రెడిబులిటీ పొగొట్టుకునే పనిచేయరు. రేపు ఫలితం తేడా వస్తే, ఆయనను మామూలుగా దుయ్యబట్టరు. అది తెలిసీ ఇంత ధైర్యంగా ఫలితాలపై జోస్యం చెప్పారు అంటే, ఆయన దాన్ని ప్రగాఢంగా నమ్మివుండాలి..

ఇదిలావుంటే లగడపాటి జోస్యమే నిజం కాబోతోందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందుకు ఒకటే నిదర్శనం అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. జాతీయ మీడియా ఇంతలా అనుకూల సర్వేలు ఇచ్చినా, తెరాస అధినేత కేసిఆర్ సంగతి అలా వుంచితే, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ మీడియా ముందుకు రాలేదు. పోనీ మీడియానే వాళ్ల ముందుకు వెళ్లలేదు అని అనుకోవడానికి కూడా లేదు. 

మరి ఎందుకు చిన్నపాటి స్పందన కూడా లేదు హరీష్ రావ్ నుంచి, కేటీఆర్ నుంచి. అదే విధంగా ట్విట్టర్ లో యాక్టివ్ గా వుంటారు కేటీఆర్. తెరాసకు అనుకూలమైన ట్వీట్ ఎవరువేసినా, రీట్వీట్ లేదా లైక్ కొడుతూనే వుంటారు. అలాంటిది కష్టపడిన నాయకులకు కృతజ్ఞతలు అని ట్వీట్ వేసి ఊరుకున్నారు తప్ప, ఈ సర్వేల గురించి మాట మాత్రం ప్రస్తావించలేదు. 

మరోపక్క రేవంత్ రెడ్డి మీడియాతో అద్భుతంగా మాట్లాడారు. దాదాపు ఆయనే కాబోయే సిఎమ్ అన్నంత రేంజ్ లో మాట్లాడారు.ఇదంతా చూస్తుంటే జాతీయ మీడియా సర్వేలు గాలి సర్వేలు అన్న అనుమానం కలుగుతోంది. లగడపాటి మాత్రం ఇక్కడ వుండి గ్రౌండ్ లెవెల్ లో సర్వే చేసినట్లు కనిపిస్తోంది. ఈ సంగతి ఎవరికి తెలియకున్నా, కేసిఆర్, కెటిఆర్, హరీష్ రావ్ లకు తెలిసే మౌనంగా వుండిపోయినట్లు అనుకోవాల్సి వస్తోంది.