cloudfront

Advertisement


Home > Politics - Political News

పవన్ కల్యాణ్ కొత్త బట్టలు కుట్టించుకోవచ్చు..!

 పవన్ కల్యాణ్ కొత్త బట్టలు కుట్టించుకోవచ్చు..!

మొత్తానికి పవన్ కల్యాణ్ కు పెద్ద భరోసానే దొరికింది! పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా కావడం ఖాయమని సర్వేల లగడపాటి చెప్పారు! 'పవన్ కల్యాణ్ వెలగపూడి అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా అడుగుపెడతారు..' అని డైలాగ్ సైతం కొట్టారు లగడపాటి. ఇంకేముంది.. పవన్  కల్యాణ్ కొత్త బట్టలు కుట్టించేసుకుని రెడీ అయిపోవచ్చు. అసెంబ్లీకి వెళ్లడానికి ఇప్పటి నుంచినే ప్రిపరేషన్ మొదలుపెట్టొచ్చు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం ఎలాగో కూడా బట్టీ పట్టొచ్చు!

అయితే పవన్ ఎమ్మెల్యే కావడం ఖాయమని చెప్పిన లగడపాటి ఆయన ఎక్కడ గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్తారో మాత్రం చెప్పలేదు! అది లగడపాటికి అయినా తెలుసో లేదో! 'పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే కావడం ఖాయం..' అంటూ చెప్పిన ఈయన, జనసేన మాత్రం పెద్దగా సీట్లు సాధించలేదని తేల్చేశారు. చిరంజీవి 'ప్రజారాజ్యం' పార్టీ కన్నా 'జనసేన'కు తక్కవ సీట్లు వస్తాయని తేల్చారు. ఇది మాత్రం జనసేన అభిమానులను గాయపరిచే అంశమే!

తెలంగాణలో హంగ్ వస్తుందన్నట్టుగా చెప్పుకొచ్చిన లగడపాటి రాజగోపాల్ ఏపీలో మాత్రం అలా జరగదని బల్లగుద్దారు. తెలంగాణ  లో మహాకూటమి లీడ్ అన్నట్టుగా మాట్లాడిన ఈయన జోస్యం తలకిందుల అయ్యింది. ఏపీలో తెలుగుదేశం  పార్టీ లీడ్ లో ఉంటుందన్నట్టుగా చెబుతున్న తాజా జోస్యం ఏమవుతుందో! అయినా ఈ  జోస్యాలతో ఈవీఎంలలో ఫలితాలు మారవులే! అసలు కథ మే 23నే! అంత వరకూ ఇలాంటి కామెడీలే!