cloudfront

Advertisement


Home > Politics - Political News

లగడపాటి.. ఇంట్లో వాళ్లపై అంచనాకు రావయ్యా!

లగడపాటి.. ఇంట్లో వాళ్లపై అంచనాకు రావయ్యా!

ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకి మోత అంటే ఇదేనేమో. ఒకవైపు ఊరందరి గురించి చెప్పే శకునం చెప్పే లగడపాటి తన ఇంట్లో వాళ్ల విషయంలో మాత్రం అంచనాకు రానట్టుగా ఉన్నాడు. ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తుందన్నట్టుగా జోస్యం చెబుతున్న లగడపాటి మాటలకు కనీసం ఆయన ఇంట్లో వాళ్లు కూడా ప్రభావితం కానట్టుగా ఉన్నారు. మరెవరో కాదు.. ఆయనే భార్యే లగడపాటి అంచనాలకు విరుద్ధంగా వ్యవహరించింది.

ఆమె మహాకూటమి అభ్యర్థికి వ్యతిరేకంగా.. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసింది. అదీ ఖైరతాబాద్  నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గంలో తెరాస అభ్యర్ధి దానం నాగేందర్ సతీమణితో పాటు.. లగడపాటి సతీమణి పద్మ ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి దానం నాగేందర్ ను గెలిపించాలని లగడపాటి పద్మ ప్రచారం చేసింది.

తెలంగాణ రాష్ట్ర సమితికి మరో అవకాశం ఇవ్వాలని లగడపాటి పద్మ పిలుపునిచ్చింది. ఏ ప్రభుత్వమూ ఒకే టర్మ్ లో అన్నీ చేసేయలేదని.. తెరాసకు మరో అవకాశం ఇవ్వాలని ఆమె వ్యాఖ్యానించింది. ఇదీ కథ. ఇదీ లగడపాటి ఇంట్లో పరిస్థితి. లగడపాటి సర్వేలు చేసేముందు.. వాటి ఫలితాలను వెల్లడించే ముందు.. ఇంట్లో వాళ్ల అభిప్రాయాలను అయినా తీసుకున్నాడో లేదో!

సుజనా ఏమార్చేది ఇలాగేనా చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్