cloudfront

Advertisement


Home > Politics - Political News

'ఆ నాకొడుకులను తన్నండి..' లోకేష్ ఆదేశం!

'ఆ నాకొడుకులను తన్నండి..' లోకేష్  ఆదేశం!

తమ వైరి పక్షం వాళ్లపై నోరు  పారేసుకున్నారు తెలుగుదేశం పార్టీ నేత లోకేష్ బాబు. మంగళగిరి ప్రచార పర్వంలో భాగంగా లోకేష్ మాట్లాడుతూ.. 'ఆ నాకొడులను తన్నమని నేను పోలీసులకు చెప్పాను..' అంటూ మాట్లాడారు. ఒకవైపు బూతులు మాట్లాడటమే కాకుండా, పోలీసులు అంటే తన ఇంట్లో పనివాళ్లు అన్నట్టుగా లోకేష్  మాట్లాడారు.

తనపై వాళ్లు బురద జల్లుతూ ఉన్నారని, అది కడుక్కోవడమే తనకు పని అయిపోయిందని.. అందుకు తను పోలీసులకు చెప్పినట్టుగా, 'ఆ నా కొడుకులను తన్నమని చెప్పాను..' అని లోకేష్ ప్రకటించుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారాయి.

మరి లోకేష్ తీరేమిటో ఇక్కడ అర్థం అయిపోతూ ఉంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు మామూలే. ఆ మాటకు వస్తే తెలుగుదేశం వాళ్లు బురద జల్లడంలో ఎంత ముందుంటారో ఎవరికి చెప్పనక్కర్లేదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటంలో లోకేష్ బాబుకు సాటి వచ్చే వారు కూడా లేరు.

ఇలాంటి నేపథ్యంలో.. లోకేష్ బాబు.. తన వైరి పక్షాల వారి విషయంలో బూతులు మాట్లాడే దశకు వచ్చారు. మరీ దిగజారి తన స్థాయి ఏమిటో.. తన నోటి కంపు ఎలా ఉంటుందో.. ఈ మాటలతో లోకేష్ బాబు చాటి చెప్పుకున్నాడు. ఒకవైపు చంద్రబాబు నాయుడు సీనియర్ ఎన్టీఆర్ నే 'వాడు' అన్న వీడియో వైరల్ గా మారింది. ఇక లోకేష్ వైరి పక్షాల వాళ్లను ‘ఆ నా కొడుకులు’ అంటున్నారు. ఇదేనా సభ్యత?