cloudfront

Advertisement


Home > Politics - Political News

లోకేష్ ఎపిసోడ్... పరువు పోయిందిగా..!

లోకేష్ ఎపిసోడ్... పరువు పోయిందిగా..!

పెద్ద నాయకుల వారసులు అనుసరించే రూట్లో ఎపుడూ నారాలోకేష్ వెళ్ళలేదు. అందుకే ఆయన పోకడలపై విమర్శలు అదేపనిగా వస్తూంటాయి. పార్టీ అధికారంలో ఉండి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలవకుండా పెద్దల సభలో చిన్నబ్బాయిగా లోకేష్ ఎపుడైతే ప్రవేశించారో నాటి నుంచి టీడీపీ గెలుపు మీద ఆయన నీలి నీడలు పడేశారు. ఇక ఇపుడు అసలైన ఎన్నికల వేళ కూడా చేయాల్సినదంతా చేస్తున్నారు.

ఎక్కడో సీమ జిల్లాలకు చెందిన లోకేష్ ఉత్తరాంధ్ర వైపు రావడమే ఓ షాక్. వచ్చింది వచ్చినట్లుగా కాకుండా విపరీతమైన హైప్ క్రియేట్ చేయించి మొత్తం మూడుజిల్లాలు లోకేష్ రాకతో వూగిపోయి సైకిల్ పార్టీ ఖాతాలో గంపగుత్తగా సీట్లన్నీ మొత్తానికి మొత్తం పడిపోతాయ‌ని తెగ బిల్డప్ ఇచ్చుకోవడం మరో ముచ్చట.

ఇలా సాగర తీరంలో సరికొత్త రాజకీయ తుపాన్ అన్నంతగా హడావుడి చేసి అంతలోనే చప్పున చల్లారి తీరం దాటేసిన చినబాబు టీడీపీ శ్రేణులకు ఛివరకు ఏమి సందేశం ఇచ్చారు. కంచుకోట లాంటి భీమిలీలో కూడా తాను నిలిచి గెలవలేననా. లేక కాస్మోపాలిటన్ సిటీ విశాఖలో సైతం తనహవా సాగదనా. ఓ వైపు మళ్ళీ ఏపీలో టీడీపీదే మళ్ళీ అధికారం అంటూ జబ్బలు చరచుకుంటూ అనుకూల మీడియా రాస్తున్న రాతలు అలాగే ఉన్నాయి.

ఇక లోకేష్ తో ఉత్తరాంధ్రకు మహర్దశ వచ్చేసినట్లేనంటూ వండి వార్చిన కధనాలు ఉండనే ఉన్నాయి. ఇంతలోనే తట్టాబుట్టా చినబాబు సర్దేయడం వెనక మతలబు ఏంటో మరి. కంచుకోటల్లాంటి జిల్లాలోనే తమకు చుక్కెదురు అవుతుందనే లోకేష్ ఇలా గోటూ పెవిలియన్ అన్నాడని చెప్పుకుంటారా. వెనకబడిన జిల్లాల ఉద్ధరణ అంటూ రాసిన అనుకూల మీడియా ఇపుడేమంటుందో మరి. నిజానికి విశాఖ ఉత్తరం, భీమిలీ రెండుచోట్ల పార్టీ చేసిన సర్వేల్లో లోకేష్ కి ఏం బాలేదన్న రిజల్ట్ వచ్చిందన్న కారణంగానే ఇక్కడ పోటీకి ఫుల్ స్టాప్ పెట్టేసి వెనక్కు వెళ్ళారని విపక్షం అపుడే కోడై కూస్తోంది.

మరి తన గెలుపుతో మంచి ఊపు తెచ్చేసి టోటల్ సీట్లన్నీ టీడీపీ ఖాతాలో వేస్తానంటున్న లోకేష్ ఇపుడు పోటీ చేయకుండా వెనక్కి తగ్గడం ద్వారా ఆ పార్టీ బేలతనాన్ని లోకానికి చెప్పకుండా చెప్పేశారా. విలువైన పుణ్య కాలమంతా ఇలా సీట్ల తకరారుతో ఖర్చు రాసేసిన భావి నాయకుడు ఇపుడు టీడీపీ తమ్ముళ్ల ఆత్మస్థైర్యాన్ని పూర్తిగా తగ్గించేసి డీలాపడేలా చేశారా అంటే అవుననే ఆన్సర్ వస్తొంది. మొత్తానికి గత కొన్ని రోజులుగా లోకెష్ విశాఖ పోటీ పేరు మీద సాగిన ఎపిసోడ్ మొత్తం టీడీపీ పరువు పోయేలా చేసిందని తమ్ముళు వగచి వాపోతున్నారు.

విశాఖలో పదిహేనుకు పదిహేను సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్న తమ్ముళ్లకు లోకేష్ పలాయనం మింగుడు పడడంలేదు. చినబాబుకే ఓటమి భయం అంటూ ప్రతిపక్షం వేస్తున్న సెటైర్లకు ఎన్నికల ముందే ఓడినంత పనవుతోందని తమ్ముళ్ళు ఆవేదన చెందుతున్నారంటే అందులో ఎంతో అర్ధముందిగా.

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

బాబుది ఎదురుదాడే.. నిజాన్ని ఎదుర్కొనలేరు!