cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

లోకేశ్ నాయుడు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

లోకేశ్ నాయుడు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

లోకేశ్‌నాయుడు ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేశాడు. దీనికి పోలీసులు, తాడేప‌ల్లి గూడెం ఎమ్మెల్యే వేధింపులే కార‌ణ‌మ‌ని అత‌ను ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. హెడ్డింగ్ చ‌ద‌వ‌గానే కొంప‌దీసి ఆ లోకేశ్‌పై ఆలోచ‌న‌లు పోలేదు క‌దా? ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే ఈ లోకేశ్ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంత మాత్రం కాదు. ఈయ‌న ప‌క్కా జ‌న‌సేన‌.

వివ‌రాలిలా ఉన్నాయి. ప‌శ్చిమగోదావ‌రి జిల్లా తాడేప‌ల్లిగూడెం నివాసి లోకేశ్ నాయుడు. ఈయ‌న ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభిమాని. ప‌వ‌న్ నాయ‌క‌త్వంలోని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌. ఈయ‌న ఇంటి పేరు ఉన్నిమ‌ట్ల‌. ఈయ‌న ఏపీ నిట్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగి. తాను బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందేందుకు య‌త్నించ‌డానికి గ‌ల కార‌ణాలు వివ‌రించాడు.

చేయ‌ని త‌ప్పున‌కు పోలీసులు కేసు పెట్టార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఈ నెల 18వ తేదీ నుంచి త‌న‌ను వేధిస్తున్న‌ట్టు లోకేశ్ తెలిపాడు. ఇసుక లారీని అడ్డుకున్నందుకు పోలీసులు కేసు న‌మోదు చేశార‌న్నాడు. అంతేకాదు కాంట్రాక్ట్ ఉద్యోగం నుంచి తొల‌గించిన‌ట్టు ఆయ‌న తెలిపాడు. జ‌న‌సేన పార్టీలో ప‌నిచేయ‌డ‌మే పోలీసుల వేధింపుల‌కు కార‌ణ‌మ‌న్నాడు. పోలీసులతో పాటు తాడేప‌ల్లిగూడెం ఎమ్మెల్యే వేధింపులు తాళ‌లేక జీవితంపై విర‌క్తి చెందానన్నాడు. అందుకే తాను బుధ‌వారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి పాల్ప‌డిన‌ట్టు లోకేశ్ నాయుడు చెప్పాడు.

ప్రతిపక్ష నేతగా బాబు చేసిందేంటి..?