cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

చినబాబు ఉగ్రరూపం.. గాలి తీసేసిన వైసీపీ

చినబాబు ఉగ్రరూపం.. గాలి తీసేసిన వైసీపీ

వయసు పెరుగుతున్నా మాటలు రాని బిడ్డ.. ఉన్నట్టుండి అమ్మా అని పిలిస్తే తల్లిదండ్రులకు ఎంతో సంతోషం. ప్రస్తుతం లోకేష్ ని చూస్తే టీడీపీ నేతలు, కార్యకర్తల పరిస్థితి ఇలానే ఉంది. లోకేష్ ఉన్నట్టుండి శాసన మండలిలో కాస్త కుదురుగా మాట్లాడారు. అదేమీ గొప్ప సబ్జెక్ట్ కాదు, ఈయన గారి మాటలకు అధికార పక్షం బెంబేలెత్తిపోలేదు. ఒకదాని వెంట ఒకటి నాలుగు వాక్యాలు తడబడకుండా మాట్లాడాడు అంతే. అయితే దానికి పచ్చబ్యాచ్ చేస్తున్న ఓవర్ యాక్షన్ చూస్తుంటే మాత్రం నవ్వురాక మానదు.

సోషల్ మీడియాలో లోకేష్ ని మరీ ఆకాశానికెత్తేస్తున్నారు. చినబాబు ఫామ్ లోకి వచ్చారని, మండలిలో లోకేష్ ఉగ్రరూపం చూపించారని, వైసీపీ మంత్రులకు ముచ్చెమటలు పట్టించారని ఏదేదో రాసేస్తున్నారు. బాలకృష్ణ డైలాగుల్లా.. లోకేష్ మాటలన్నీ ఒకదాని వెంట ఒకటి పేర్చి అందంగా ఎడిట్ చేసుకుని పదే పదే పోస్ట్ చేస్తూ ముచ్చట పడుతున్నారు. అసలింతకీ లోకేష్ మండలిలో ఏం మాట్లాడారని టీడీపీ అంతగా చంకలు గుద్దుకుంటోంది?

పసుపు కుంకుమ నిధులు దారి మళ్లాయన్న ఆరోపణలపై సమాధానమిచ్చారంతే. అక్కడి నుంచి జగన్ పై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. జైలు, బెయిలు, కోర్టులు అంటూ కోతలు కోశారు. శాసనమండలి గౌరవాన్ని కాపాడకుండా రాజకీయ పార్టీ మీటింగ్ లా రెచ్చిపోయారు. పోనీ రెచ్చిపోయారే అనుకుందాం. ఆ వెంటనే వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లోకేష్ ని ఓ రేంజ్ లో ఏకిపారేశారు. కాంగ్రెస్ తో టీడీపీ కుమ్మక్కై జగన్ పై కేసులు పెట్టి కక్షసాధించారని, అలాచేసినా కూడా ఈనాడు 85శాతం సీట్లు, 55శాతం ఓట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చిందని.. టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితమైందని ఎద్దేవా చేశారు.

అంతేకాదు.. గూగుల్ పప్పు అంటూ లోకేష్ పరువు తీసిపారేశారు. మంగళగిరి పేరు కూడా సరిగ్గా పలకలేని నాయకుడు లోకేష్ అని... జయంతి, వర్థంతికి కూడా తేడా తెలియని అజ్ఞాని అంటూ గాలితీసేశారు. పొత్తులు లేకుండా ఏరోజూ ఎన్నికలకు పోని టీడీపీ నేతలా వైసీపీ గురించి విమర్శించేది అని కాస్త ఘాటుగానే తగిలించారు మంత్రి అనిల్.

అయితే ఈ ఎపిసోడ్ అంతా కట్ చేసుకుని కేవలం లోకేష్ కళ్లు ఉరిమి చూసే క్లిప్ లు మాత్రమే సర్క్యులేట్ చేసుకుంటూ పసుపు బ్యాచ్ పండగ చేసుకుంటోంది. ఇలా అల్ప సంతోషాలకే సంబరపడిపోతారు కాబట్టే గత ఎన్నికల్లో గెలుగు మాదే అని ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోయి నిండా మునిగారు. మొత్తమ్మీద లోకేష్ కూడా నమ్మలేనంతగా పసుపు బ్యాచ్ చినబాబుని హీరోని చేసేస్తోంది. సోషల్ మీడియా పులిగా మార్చేస్తోంది.

పూరి ఇంటర్వ్యూలో చెప్పినట్లే సినిమా ఉందా?

అమలాపాల్ తన బాయ్ ఫ్రెండ్ గురించి ఇలా