Advertisement

Advertisement


Home > Politics - Political News

లోకేష్ పెదవి విప్పారు, పాఠం అప్పజెప్పారు

లోకేష్ పెదవి విప్పారు, పాఠం అప్పజెప్పారు

ఎట్టకేలకు ట్విట్టర్ పక్షి ఎగురుకుంటూ వచ్చి శాసనమండలిలో వాలింది. కొన్నాళ్లుగా సమాజానికి దూరంగా ఉంటూ కేవలం ట్విట్టర్ లోనే కోతలు కోస్తున్న నారా లోకేష్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలిలో పెదవి విప్పారు. అయితే చినబాబు అలవాటులో పొరపాటుగా.. ట్విట్టర్ లో పెట్టిన కామెంట్లనే తనవెంట తెచ్చుకున్నారు. వాటినే హాయిగా అప్పజెప్పారు. లోకేష్ ప్రసంగం విన్న ఎవరైనా ఆఖరికి టీడీపీ నేతలైనా సరే నవ్వాపుకోలేరు.

బడ్జెట్ కేటాయింపుల గురించి లోకేష్ ప్రస్తావించిన తీరు, వైసీపీ బడ్జెట్ కి కోతలు పెట్టిందంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేసిన తీరుచూస్తే లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో ఇట్టే అర్థమవుతుంది. విదేశాలకు వెళ్లి వాళ్ల కాళ్లు, వీళ్ల కాళ్లు పట్టుకుని బతిమలాడితే ఏపీకి టీడీపీ హయాంలో పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చాయట, అలాంటి పరిశ్రమల్ని కేవలం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే వైసీపీ ప్రభుత్వం తరిమేస్తోందట. మేం ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని వైసీపీవాళ్లు నెలన్నర రోజుల్లోనే నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు చినబాబు.

అసలు రాష్ట్రానికి ఏయే పరిశ్రమలు వచ్చాయి, వచ్చి ఎంత పెట్టుబడి పెట్టాయి, ఎప్పుడు వాటి నుంచి ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయి అనే లెక్క తీస్తే.. మొదటి రెండు ప్రశ్నల దగ్గరే టీడీపీ సమాధానం ఆగిపోతుంది. కేవలం 45 రోజుల్లో నాశనమైపోయే అభివృద్ధి కోసం టీడీపీ ఐదేళ్లు కష్టపడటం ఎందుకు? అంటే పరోక్షంగా తాము ఐదేళ్లలో ఎంత పనిచేశామో లోకేష్ బాబు చెప్పకనే చెప్పారన్నమాట.

లోకేష్ ప్రసంగం ఆసాంతం పేపర్ మీదే సాగిపోయింది. చేతిలో పేపర్ చూసుకుంటూ, మరోవైపు వార్తా పత్రికల క్లిప్పింగ్ లు చూపెడుతూ, రకరకాల హావభావాలు ప్రదర్శించారు చినబాబు. మొత్తమ్మీద బాగానే ప్రిపేర్ అయ్యారు కానీ ట్విట్టర్ లో చేయాల్సిన విన్యాసాలన్నీ శాసన మండలిలో చేస్తే సరిపోతుందా? అనుకూల మీడియా చినబాబుని ఆకాశానికెత్తేసింది కానీ.. చంద్రబాబు సైతం కొడుకు ప్రిపరేషన్ పై అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. 

పరిటాల సునీతకు కోరుకున్నది దక్కింది.. ఉంటారా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?